Sharwanand: పవన్ ఫ్లాప్ సినిమా టైటిల్ ను వాడనున్న శర్వానంద్!!


Sharwanand Reusing Pawan Kalyan Title

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన “నారీ నారీ నడుమ మురారి” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వకముందే, శర్వానంద్ మరో యూత్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా స్పెషల్‌గా మారడానికి ఓ కారణం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Sharwanand Reusing Pawan Kalyan Title

పవన్ కళ్యాణ్ “జానీ” అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు, అదే టైటిల్‌ను శర్వానంద్ తన నెక్ట్స్ మూవీ కోసం వాడుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకుడు అభిలాష్ రెడ్డి మెగాఫోన్ పట్టుకోనుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. మేకర్స్ ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే, “జానీ” టైటిల్ పక్కాగా ఫిక్స్ అయ్యిందా లేదా?” అనే విషయంపై ఇంకా అధికారిక అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మరి, ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌కు కొత్త హిట్ అందిస్తుందా? అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *