Shobhita Dhulipalla: కొత్త కోడలు కి కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చిన నాగార్జున!!
Shobhita Dhulipalla: అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకకు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివాహం సంప్రదాయ హిందూ పధ్ధతి లో నిర్వహించబడగా, ఈ వేడుకలు ఎనిమిది గంటలపాటు కొనసాగుతున్నాయి.
Shobhita Dhulipalla Receives Lexus Wedding Gift
స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులతో పాటు ఎస్.ఎస్. రాజమౌళి లాంటి అనేక మంది సినీ తారలు మరియు దర్శకులు ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కినేని కుటుంబం వారి సాంప్రదాయ వైభవంతో పాటు ఆధునిక ఆతిథ్యాన్ని కలిపి ఈ వేడుకను మరింత ప్రత్యేకతను చేకూర్చారు. ఈ వివాహ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ చర్చనీయాంశంగా మారింది.
Also Read: https://telugu.pakkafilmy.com/pan-india-star-rishab-shetty-film-lineup/
అయితే, ఈ వేడుకలో ఒక ముఖ్యమైన అంశం నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేక బహుమతిని అందించడం. నాగార్జున తన అభిమానానికి నిదర్శనంగా రూ. 2 కోట్ల విలువైన టయోటా లెక్సస్ కారును శోభితకు బహుమతిగా ఇచ్చినట్లు కుటుంబ వర్గాల సమాచారం. ఈ గిఫ్ట్ శోభితకు మాత్రమే కాకుండా నాగచైతన్య కుటుంబానికి వారి ప్రేమను వ్యక్తపరుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వైభవం, తెలుగు సినీ పరిశ్రమకు కొత్త జోష్‌ని తీసుకువచ్చింది. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబం మరియు శోభిత ధూళిపాళ్ల కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వివాహం మాత్రమే కాకుండా, నాగచైతన్య-శోభిత జీవితం ఆనందం, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం.