Allu Arjun: అల్లు అర్జున్ ని అవమానించిన ఏసీపీకి షాక్.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.?
Allu Arjun: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ఘటన గురించే కనిపిస్తోంది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు, పోలీసులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అల్లు అర్జున్ పై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. హీరో అయితే అంత అహంకార భావమా, పేదల ప్రాణాలు అంటే లెక్క లేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వ్యవహారంపై ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా విమర్శించారు.
Shock to ACP who insulted Allu Arjun Revanth Reddy strong warning
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఏసిపికి కౌంటర్ ఇచ్చారు. మరి ఈ తతంగం ఏంటో చూద్దామా.. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ఏసీపీ విష్ణుమూర్తి అల్లు అర్జున్ పై తీవ్రంగా విరుచుకుపడ్డ విషయం అందరికీ తెలుసు. డబ్బు, అహంకారంతో హీరో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక కేసులో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టవచ్చా అంటూ ప్రశ్నించారు. కొందరు నటులు, రాజకీయ నాయకులు పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కించపరుస్తున్నారని మేము ఒక్క పది నిమిషాలు డ్యూటీ నుంచి తప్పుకుంటే మీ పరిస్థితి ఏంటి అని అన్నారు. (Allu Arjun)
Also Read: Revanth Reddy: నాగార్జున, బన్నీ పై రేవంత్ రెడ్డి పగ పెంచుకోవడానికి కారణం అదేనా.?
థియేటర్ లో అభిమాని చనిపోతే వారిని చూడకుండా వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. అంతే కాదు తను తీసే సినిమాలో పోలీసులను కూడా చాలా వ్యంగ్యంగా చూపించారని, ప్రస్తుతం ఒక్క పోలీస్ అధికారిని కూడా నీ దగ్గరికి రాకుండా చేస్తాం అప్పుడు నువ్వు ఎలా బయటకు వెళ్తావో ఆలోచించుకో అంటూ విష్ణుమూర్తి మీడియా వేదికగా ప్రశ్నించారు. అల్లు అర్జున్ నువ్వు ఎలా నటుడు అయ్యావు, చట్టం ముందు ఎవరైనా ఒకటే ఎక్కువ చేస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించాడు.. ప్రస్తుతం ఏసీపీ మాట్లాడిన మాటలు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే తరుణంలో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు కూడా దాడి చేశారు.
ఈ వ్యవహారంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలిగిన సహించేది లేదు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉంటే బాగుంటుందని చురకలంటించారు. అలాంటి వ్యక్తులు స్పందించకుండా, పై అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించిన వ్యవహారం అంతా నెట్టింటా వైరల్ గా మారింది.(Allu Arjun)