Akkineni Akhil: అఖిల్ కి కాబోయే భార్యకి పెళ్లయ్యి విడాకులు అయ్యాయా.. షాకింగ్ నిజం.?
Akkineni Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా ఇండస్ట్రీలోకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్, ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగార్జున టాప్ పొజిషన్ లో ఉండగా నాగచైతన్య పడుతూ లేస్తూ హీరోగా నిలదొక్కుకున్నారు. అఖిల్ మాత్రం కెరియర్ పరంగా ఇంకా సెట్ అవ్వడం లేదు. అలాంటి ఈ బడా ఫ్యామిలీ కేవలం సినిమా రంగంలోనే కాకుండా నిర్మాణ రంగం, టీవీ ఛానల్ రంగంలో, వ్యాపార రంగాల్లో ఇలా ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి.
Shocking truth to Akkineni Akhil fiancee
అన్ని సమపాళ్లలో నడుపుకుంటూ వస్తున్నారు నాగార్జున. ఇలా ఎంతో పేరు ఉన్నటువంటి అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా అడుగు పెట్టాలి అంటే ఏ అమ్మాయికైనా అదృష్టం ఉండాలి. అలా నాగచైతన్యని పెళ్లి చేసుకొని ఈ ఫ్యామిలీలోకి అడుగు పెట్టింది సమంత. కానీ వీరి బంధం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అలాంటి ఈ ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అఖిల్ కు భార్యగా మరో అమ్మాయి రాబోతోంది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే జైనబ్ రావడ్జి. అయితే ఈమెకు అఖిల్ కు ఎంగేజ్మెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. (Akkineni Akhil)
Also Read: Samantha: నాగ చైతన్య పెళ్లి వేళ.. వైరల్ అవుతున్న సమంత సెన్సేషనల్ కామెంట్స్!!
అయితే అఖిల్ కు ఇప్పటికే ఓసారి ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో అఖిల్ ఈసారి చాలా పకడ్బందీగా ఎంగేజ్మెంట్ చేసుకొని తప్పనిసరిగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయరట. అయితే ఈమెతో అఖిల్ గత ఆరు సంవత్సరాలుగా లవ్ లో ఉన్నారట. చివరికి వీరి ప్రేమను ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ కూడా జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అఖిల్ పెళ్లి చేసుకునే అమ్మాయికి 39 సంవత్సరాలని, అబ్బాయికి కేవలం 30 సంవత్సరాలని తెలుస్తోంది.
అంతేకాకుండా జైనబ్ పెయింటర్ అని అలాగే పలు వ్యాపారాలు కూడా చూసుకుంటుందని, అలాగే ఈమెకు గతంలోనే పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇందులో ఎంత వరకు నిజమో, అబద్దమో తెలియదు కానీ ఈ వార్త నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఇక జైనబ్ తండ్రి పేరు జుల్ఫీ ఈయన నాగార్జునకు మంచి స్నేహితుడు.. ఈయనకు విదేశాల్లో ZR ఇన్ఫ్రా పేరుతో అనేక వ్యాపారాలు వేలాది కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయట.. అలా నాగార్జున జుల్ఫీ మధ్య పరిచయమే వీరిద్దరి వివాహానికి దారితీస్తుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.(Akkineni Akhil)