Chiranjeevi: చిరుత ఆ హీరో చేయాల్సిందా.. కానీ చిరంజీవి అన్యాయంగా లాక్కున్నారా.?

Chirutha Movie: రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూవీ చిరుత.. ఈ సినిమాతోనే రామ్ చరణ్ తండ్రికి తగ్గ కొడుకు అనే బిరుదు కూడా సంపాదించారు. ఈ సినిమాలో చరణ్ మాస్ యాంగిల్ కి మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సింది కాదట. వేరే హీరో చేయాల్సిందట. ఆ హీరో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారట.మరి ఇంతకీ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీ ని మొదట చేసిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
Should that hero do Chirutha Movie but
రామ్ చరణ్ నటించిన చిరుత మూవీ మొదట చేయాల్సింది ఎవరో కాదు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్.డేంజర్,143,బంపర్ ఆఫర్ వంటి సినిమాలు చేసిన సాయిరాం శంకర్ పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా పోషించారు. అయితే అలాంటి సాయిరాం శంకర్ మొదట చిరుత మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారట. అది కూడా మెహర్ రమేష్ డైరెక్షన్ లో.. (Chirutha Movie)
Also Read: Meena: ఇన్నాళ్లకు మీనా మంచి నిర్ణయం.. ఆ హీరోతో రెండో పెళ్లిపై సంచలనం.?
మెహర్ రమేష్ మొదట ఈ సినిమాని తీద్దామని బ్యాంకాక్ లో ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారట. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడిందట. అయితే ఈ విషయం అశ్వినీ దత్ కి తెలియడంతో మెహర్ రమేష్ చేయాల్సిన సినిమా కథ పూరి జగన్నాథ్ కి కూడా ఐడియా ఉందని కాస్త కథలో మార్పులు చేర్పులు చేసి చివరికి పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రామ్ చరణ్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలి అనుకున్నారట.

అలా రామ్ చరణ్ ని మాస్ యాంగిల్ లో పూరి జగన్నాథ్ చిరుత మూవీలో చూపించాలనుకున్నారు.అయితే చిరంజీవికి కథ చెప్పగా బాగా నచ్చడంతో కొడుకు మొదటి సినిమాకి ఓకే చెప్పారు.అలా చిరుత మూవీ సాయిరాం శంకర్ ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసి కొన్ని కారణాల వల్ల వాయిదా పడడంతో అది కాస్త రామ్ చరణ్ చేతికి వెళ్లింది. అలా సాయిరాం శంకర్ చేయాల్సిన చిరుత మూవీ రామ్ చరణ్ చేతిలో పడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.(Chirutha Movie)