Jani Master: జానీ మాస్టర్ శ్రష్టి వర్మతో ఉంటూ మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడా.?
Jani Master: ఆ మధ్యకాలంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి ఒక సంఘటన విపరీతంగా సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో హల్చల్ చేసింది.. ఆయన దగ్గర పనిచేసే షష్టి వర్మ అనే అమ్మాయిని డాన్స్ మాస్టర్ మానసికంగా, శారీరకంగా వాడుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం బయటకు వచ్చింది.. అయితే శ్రష్టి వర్మను జానీ మాస్టర్ మైనర్ గా ఉన్నప్పటినుంచి లైంగికంగా వేధిస్తున్నారని కేసు నమోదు అవ్వడంతో ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసు వల్ల జానీ మాస్టర్ తనకు రావలసినటువంటి జాతీయ అవార్డును కూడా కోల్పోవలసి వచ్చింది.
Shreshti Varma shocking comments on Jani Master
అలాంటి ఈయన బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తను చెప్పవలసిన విషయాలన్నీ మీడియాకు చెప్పుకున్నారు. చాలా ఎమోషనల్ అవుతూ తన తప్పు లేదని చెప్పుకొచ్చారు.. దీనిపై మళ్లీ స్పందించినటువంటి శ్రష్టి వర్మ నేను ఆయనపై కక్షతో ఏమి కేసు పెట్టలేదు.. అది నా ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ, ఒక అమ్మాయిని మానసికంగా శరీరకంగా వాడుకుని.. అదే సమయంలో మరో అమ్మాయితో ఉంటే ఆమె తట్టుకోగలరా అదే నేను చేశాను అంటూ చెప్పుకొచ్చింది.. నన్ను అన్ని రకాలుగా దెబ్బతీసిన ఆయనపై నేను ఫైట్ చేయాలి కదా.(Jani Master)
Also Read: Telugu Actress: ఐఏఎస్ కావాలని కలలు కంది.. కట్ చేస్తే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్!!
ఒకవేళ నేను ఈ విధంగా స్పందించకపోతే నాకు చావే శరణమయ్యేది అంటూ చెప్పుకొచ్చింది. కానీ చావడం కంటే ఆయనపై పోరాటం చేయడం మంచిదని నాకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాను.. అయితే నా వెనుక ఎవరో పెద్ద హీరో ఉండి నడిపిస్తున్నారని చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.. నా వెనుక ఒక్కరు కూడా లేరు నాకు నేనే ధైర్యం నేనొక్కదాన్నే ఒంటరి పోరాటం చేయడానికి ఇలా చేశానని చెప్పుకొచ్చింది.. జానీ మాస్టర్ జాతియ అవార్డు పోవడానికి కారణం నేనే అంటూ కొంతమంది అంటున్నారు..
అవార్డు పోవడానికి కారకురాలిని నేను ఎందుకు అవుతాను.. అవార్డు అనేది కేవలం వ్యక్తికి ఉండే టాలెంటుకు మాత్రమే ఇవ్వరు ఆయన క్యారెక్టర్ ను అన్ని రకాలుగా చూసే ఇస్తారు.. అలా క్యారెక్టర్ లేని వాళ్లకు అవార్డు ఇవ్వడం కూడా వేస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.. ఈ విధంగా శ్రష్టి వర్మ జానీ మాస్టర్ పై మరోసారి గట్టిగా స్పందించింది.అయితే శ్రష్టి వర్మ మాట్లాడిన విధానం చూస్తుంటే ఆమెతో ఉంటూనే జానీ మాస్టర్ మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారా ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి.(Jani Master)