Shreyas Iyer: రంజీ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ రెండో సెంచరీ చేశాడు. దీంతో రంజీ ట్రోఫీలో శ్రేయస్ చేసిన సెంచరీ ఇన్నింగ్స్ ఐపీఎల్ మెగా వేలంలో అతని విలువను మరింతగా పెంచనుంది. అందుకే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు అయ్యర్ జట్టులో చోటును దక్కించుకోలేకపోయాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులో కూడా అయ్యర్ కు స్థానం లేదు. ఈ లోగా విడుదల చేసిన ఐపిఎల్ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో శ్రేయస్ అయ్యర్ పేరు లేకుండా పోయింది. గత సీజన్లో కేకేఆర్ కు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును గెలిపించిన అయ్యర్ ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. ఐపీఎల్ విడుదల చేసిన ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలో కూడా అయ్యర్ పేరు లేదు. Shreyas Iyer
Shreyas Iyer Sending Warning To KKR
గత సీజన్లో కేకేఆర్ కు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును గెలిపించిన అతడిని కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అయ్యర్ తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో వేలంలో భారీ మొత్తాన్ని రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో అయ్యర్ ముంబై తరఫున ఆడుతున్నాడు. ఈ టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు తన ఆట తీరుతో తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ నాలుగో రౌండ్ లో ఒడిశా పైన అయ్యర్ అద్భుతమైన సెంచరీని సాధించాడు. 2024-25 రంజి ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. Shreyas Iyer
Also Read: Jagan: త్వరలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూలబోతుంది.. టిడిపికి జగన్ వార్నింగ్ ?
అయ్యర్ కేవలం 101 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఇది 15వ సెంచరీ. ఇక గాయం కారణంగా త్రిపురతో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ ఆడలేకపోయాడు. అంతకుముందు మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో అయ్యర్ 190 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 142 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలతో మంచి ఫామ్ కనబరిచిన అయ్యర్ ఇప్పుడు భారత జట్టులో పునరాగమనంపై కన్ను వేశాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే…. శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. అతడే స్వయంగా వేళానికి వెళ్లాలని నిర్ణయించుకున్న అందువల్ల అతడిని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చిందని జట్టు సీఈవో వెంకీ మైసూర్ స్పష్టం చేశారు. దీంతో అయ్యర్ వచ్చే ఎడిషన్ లో మరో జట్టుకు ఆడనున్నాడు. Shreyas Iyer