Shriya: 42 ఏళ్ళున్నా తగ్గేదేలే.. తమ్ముడు వయసున్న హీరోతో శ్రీయా రొమాన్స్..?
Shriya: శ్రియా శరన్..ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక ఎలాంటి ఆఫర్ ఇచ్చిన చేసే పనిలో ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఏజ్ 42 ఏళ్లు..కానీ తమ్ముడు వయసున్న హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయింది.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. శ్రీయా శరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Shriya romance with a younger hero
సీనియర్ బ్యూటీ శ్రియా ప్రస్తుతం ఏ ఆఫర్ ఇచ్చిన చేయడానికి రెడీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ యంగ్ హీరోతో రొమాన్స్ చేయబోతుందట. ఆ హీరో ఎవరయ్యా అంటే.. తేజ సజ్జా.. తేజ సజ్జా హీరోగా మిరాయ్ అనే సినిమా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈసినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.(Shriya)
Also Read: Sri Sathya: అందరూ చిన్న గా ఉందంటున్నారు..అందుకే సర్జరీ తప్పలేదు.. బిగ్ బాస్ ఫేమ్!!
ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా చేస్తే ఈయనకి విలన్ పాత్రలో ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా ఉన్న మంచు మనోజ్ నటిస్తున్నారు.అయితే ఫస్ట్ టైం మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించడంతో చాలామంది షాక్ అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ శ్రియా శరన్ ఓ ఐటమ్ సాంగ్ చేయబోతుందట.
అయితే శ్రియ శరణ్ ఐటెం సాంగ్ తేజ సజ్జాతో చేస్తుందా లేక మంచు మనోజ్ తో చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఐటెం సాంగ్ అంటే హీరో తోనే చేస్తారు కాబట్టి తేజ సజ్జా తో సీనియర్ బ్యూటీ శ్రీయా శరణ్ రొమాన్స్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.(Shriya)