Siddhu Jonnalagadda: ఆ దర్శకుడికి సిద్ధు జొన్నలగడ్డ గ్రీన్ సిగ్నల్.. క్రేజీ కాంబినేషన్!!
Siddhu Jonnalagadda: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “జాక్” శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు, “తెలుసు కదా”, “కోహినూర్” వంటి సినిమాలను కూడా సిద్ధు చేస్తున్నాడు. అయితే, తాజాగా ఆయన మరొక కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ పరశురామ్ పెట్ల తో సినిమా చేయడానికి సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సినీ వర్గాలు తెలిపాయి.
“గీతా గోవిందం”, “సర్కారు వారి పాట” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ పెట్లా ప్రస్తుతం ఒక కొత్త కథతో సిద్ధు జొన్నలగడ్డ దగ్గరకు వెళ్లారు. ఈ కథను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు వినిపించిన తరువాత, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకున్నారంటున్నారు. ఆతర్వాత, ఈ కథను సిద్ధు జొన్నలగడ్డ కు కూడా వినిపించారని, కథ నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు, సిద్ధు ఈ చిత్రంలో పాత్ర ఎలా ఉంటుందో, పరశురామ్ తో కాంబినేషన్ ఎలా ఉంటుందో అన్నది మరింత ఆసక్తిగా మారింది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.