Sikandar Raza: జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా అంతర్జాతీయ టి20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా ప్రపంచంలోనే రికార్డు సృష్టించాడు. అతను కేవలం 33 బంతుల్లోనే సెంచరీ సాధించి రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు. సికిందర్ రజాకు మంచి బలం ఉంది. దీనికి కారణం అతను తీసుకునే ఆహారం. Sikandar Raza
Sikandar Raza Food Datailes
ఈ ఆటగాడు తన ఆహారంలో మాంసాహారం, అన్నం అస్సలు ముట్టుకోడు. మాంసాహారం అంటే తనకు చాలా ఇష్టమని సికిందర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నం కన్నా నాన్ వెజ్ ఎక్కువగా తింటానని చెప్పాడు. అతను ముఖ్యంగా ఐదు రకాల జంతువుల మాంసాన్ని తింటాడట. ఇదే తనకు మంచి బలం ఇస్తుందని సికిందర్ వెల్లడించాడు. Sikandar Raza
Also Read: Kuppam: కుప్పంలో వైసీపీ పార్టీ కార్యాలయం క్లోజ్?
ముఖ్యంగా మేక, గొర్రెలు, కోడి మాంసం, గొడ్డు మాంసం, చేపలు చాలా ఇష్టమని వెల్లడించాడు. కానీ సికిందర్ తెల్ల అన్నం అసలు తినడు. అతనికి ట్యూమర్ సర్జరీ అయిన తర్వాత ఈ ఆటగాడు తెల్ల అన్నం పూర్తిగా మానేశాడట. పిజ్జా, బర్గర్, కర్రీ వంటి వాటిని అసలు ముట్టుకోనని చెప్పాడు. కేవలం జంతువుల మాంసాన్ని మాత్రమే ప్రతిరోజు మూడు పూటలా తింటానని వెల్లడించారు. అందుకే అతనికి మంచి బలం ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం సికిందర్ రజా చెప్పుకొచ్చిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sikandar Raza