Simbu: తూ..ఇది కథనా అంటూ డైరెక్టర్ పై ఉమ్మేసిన శింబు..!
Simbu: ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా మంచి గుర్తింపు పొందాడం ఎంతో కష్టపడుతున్నారు కొందరు హీరోలు. అయినా కొందరు హీరోలకు, దర్శక నిర్మాతలకు గుర్తింపు మాత్రం లభించడం లేదు. అలాంటిది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పల్లెటూరి నుంచి వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు సుశీంద్రన్.. ప్రస్తుతం ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే హీరోలు క్యూ కడతారు..

Simbu spat on the director saying this is a story
అలాంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఒక హీరోకు కథ చెప్తే, ఇది కథనా అంటూ మొహం మీద ఉమ్మేసినంత పని చేశారట.. మరి ఆ హీరో ఎవరు వివరాలు చూద్దాం.. తమిళ్ లో ఫేమస్ డైరెక్టర్ గా పేరు పొందారు సుశీంద్రన్..ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.. చిన్న వయసులోనే చెన్నైకి చేరుకొని అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని 12ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి, చివరికి ఓ స్థాయికి వచ్చారు.. అలాంటి ఈ డైరెక్టర్ మొదటిసారి తీసినటువంటి వెన్నెల కబడ్డీ కూజు చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈయన తమిళ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా మారిపోయాడు..(Simbu)
Also Read: Esther: తేజా గురించి అసలు నిజం చెప్పిన ఎస్తేర్ నోరోన్హా!!
ఆ తర్వాత కార్తీక్ కాజల్ తో మరో సినిమా తీసి బంపర్ హిట్ అందుకున్నాడు.. ఏ సినిమా తీసిన సహజమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెను తాకేలా చేయడంలో సుశీంద్రన్ దిట్ట అని చెప్పవచ్చు.. అలాంటి ఈ డైరెక్టర్ 2021లో హీరో శింబుతో ఈశ్వరన్ అనే చిత్రాన్ని తీశాడు.. అయితే నిజానికి ఈ స్టోరీని హీరో జై కోసం రాసుకున్నారట.. అయితే ఈ కథను ఆయనకు వినిపిస్తే నాకు నచ్చలేదని చెప్పడంతో ఈ కథను తీసుకెళ్లి శింబుకు వినిపించారట..

కథాంత విన్నాక శింబు ఛీ.. తూ.. కథ బాగాలేదు అంటూ ఉమ్మేశారట..దీంతో సుశీంద్రన్ శింబు కోసం కథను పూర్తిగా చేంజ్ చేసి ఆయనకు తగ్గట్టుగా తయారుచేసి సినిమా తీశారట.. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..ఈ విధంగా శింబు ఉమ్మి వేయడంతో అధికాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎంత పెద్ద హీరో అయితే మాత్రం డైరెక్టరుపై ఉమ్మేస్తారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు..(Simbu)