Simran: బయటపడ్డ సిమ్రాన్ ఎఫైర్.. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన నటుడితో.?

Simran: సీనియర్ నటి సిమ్రాన్ ఇప్పటికి కూడా అంతే యంగ్ గా కనిపిస్తూ సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనేలా ఉంది. కానీ ఈ హీరోయిన్ ఎక్కువగా సినిమాల్లో రాణించడం లేదు.ఆ మధ్యకాలంలో తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటించిన సీమ రాజా సినిమాలో సమంతకు సవతి తల్లి పాత్రలో నటించింది.ఈ సినిమాలో సిమ్రాన్ విలనిజానికి చాలామంది ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత మళ్లీ సిమ్రాన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.
Simran affair revealed
ఇక రీసెంట్ గా ఆది పినిశెట్టి నటించిన శబ్దం మూవీలో సిమ్రాన్ కనిపించింది.అయితే అలాంటి సిమ్రాన్ అప్పట్లో హీరో బాలకృష్ణకి పర్ఫెక్ట్ జోడి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో బాలకృష్ణకి విజయశాంతి తర్వాత గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా సిమ్రాన్ మారిపోయింది.ఇక సిమ్రాన్ కేవలం బాలకృష్ణతో మాత్రమే కాకుండా చిరంజీవి,నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. (Simran)
Also Read: Sobhita: శోభిత ప్రెగ్నెంటా.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్…?
అలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సిమ్రాన్ చివరికి పెళ్లయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకంటే వయసులో 20ఏళ్ళు పెద్దవాడైన హీరోతో ప్రేమలో ఉంది అని,ఆ హీరోనే సిమ్రాన్ పెళ్లి చేసుకుంటుంది అనే రూమర్లు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా సిమ్రాన్ కొరియోగ్రాఫర్ అయినటువంటి రాజు సుందరం మాస్టర్ అప్పట్లో సహజీవనం కూడా చేసారని పెళ్లికి కూడా రెడీ అయినప్పటికీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్లిద్దరు విడిపోయారనే వార్తలు వినిపించాయి.

అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఆ హీరోనేనని సిమ్రాన్ ఆ హీరోతో సన్నిహితంగా మెదలడం కారణంగానే కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ సిమ్రాన్ ని పక్కన పెట్టారనే రూమర్లు కూడా వినిపించాయి.కానీ కొరియోగ్రాఫర్ రాజు సుందరం సిమ్రాన్ కి బ్రేకప్ చెప్పాక ఆ హీరో కూడా సిమ్రాన్ ని పట్టించుకోలేదట. దాంతో చివరికి దీపక్ భగ్గాని పెళ్లి చేసుకుంది.(Simran)