Singer Kalpana: మా అమ్మది సూసైడ్ కాదు.. కొత్త అనుమానాలు పుట్టిస్తున్న సింగర్ కల్పన కూతురు.?
Singer Kalpana: ఏంటి సింగర్ కల్పనద సూసైడ్ అటెంప్ట్ కాదా..ఆమెని ఎవరైనా చంపేయాలని చూసారా.. ఎందుకు కల్పనా కూతురు ప్రెస్ మీట్ లో అలాంటి మాటలు మాట్లాడింది. ఇంతకీ కల్పనా కూతురు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుంది అంటూ ఓ వార్త గత కొద్ది గంటల నుండి మీడియాని షేక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.నిన్న రాత్రి కల్పన స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఆత్మహత్యయత్నం చేసింది అనే వార్త బయటకు రావడంతోనే కల్పన గురించి ఎన్నో రకాల రూమర్లు మీడియాలో వినిపించాయి.

Singer Kalpana daughter is raising new suspicions
అయితే ఈ విషయంలో భర్త మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మీడియా,పోలీసుల ప్రశ్నలకు కల్పన భర్త అనుమానాస్పద జవాబులు ఇచ్చారని కొంతమంది వార్తలు క్రియేట్ చేశారు. ఇక స్పృహలోకి వచ్చినా కల్పన నేను నిద్ర మాత్రలు మింగడానికి కారణం నా కూతురే, కేరళలో చదువుతున్న నా కూతురు హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే నా దగ్గర చదువుకోమని చెబితే రాను అని చెప్పింది. ఆ ఆవేదనలోనే నేను నిద్రమాత్రలు మింగాను.అంటూ కల్పన చెప్పింది. (Singer Kalpana)
Also Read: Singer Kalpana: రెండో భర్త వల్లే సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్.. 2 రోజులుగా గొడవలు.?
అయితే ఈ విషయం అంతా కూతురు వైపు టర్న్ కావడంతో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కల్పనా కూతురు దయా ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసింది.మా అమ్మ సూసైడ్ చేసుకుందని చాలా మంది వార్తలు రాస్తున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు.ఒకేసారి రెండు మూడు పనులు చేయడంతో మా అమ్మ బాగా ఒత్తిడికి గురైంది. ఎందుకంటే మా అమ్మ సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తూనే మరోవైపు పీహెచ్డీ, ఎల్ఎల్ బి వంటివి పూర్తి చేస్తుంది. దాంతో బాగా ఒత్తిడికి గురైంది.

అందుకే డాక్టర్లు ఆమెకు ఇన్సోమ్నియా అనే టాబ్లెట్ ని ప్రిఫర్ చేశారు. అయితే ఆ టాబ్లెట్ రోజు వేసుకునే దానికంటే కాస్త ఎక్కువ డోస్ వేసుకోవడం వల్ల ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అందుకే అపస్పారక స్థితిలోకి వెళ్లిపోయింది. అంతేకానీ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా మా అమ్మ సుసైడ్ ట్టెంప్ట్ చేయలేదు. అలాగే మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు కూడా లేవు. ఇప్పటికైనా ఈ తప్పుడు వార్తలు రాయడం ఆపండి అంటూ కల్పనా కూతురు దయా ప్రసాద్ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.(Singer Kalpana)