Singer Kalpana: రెండో భర్త వల్లే సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్.. 2 రోజులుగా గొడవలు.?
Singer Kalpana: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలా మంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా కానీ ఆత్మహత్య చేసుకోవడం విషయంలో మాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఫేమస్ సింగర్ అయినటువంటి కల్పనా కూడా అదే దారిలోకి వెళ్ళింది. ఆత్మహత్య చేసుకుని మరణించాలని భావించిందట. మరి ఆమె ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది.. కారణం ఏంటి వివరాలు చూద్దాం..

Singer Kalpana suicide attempt due to second husband
సింగర్ కల్పన తన హస్బెండ్ ప్రసాద్ తో కలిసి నిజాంపేటలోని తన ఇంట్లో నివాసం ఉంటోంది. గత రెండు రోజులుగా తన భర్త కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారట.. ఇక ఇంట్లో ఒక్కతే ఉన్న కల్పన రెండు రోజులుగా డోర్ తీయకుండా కనీసం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి పోయిందట.. దీంతో ఇంటి పక్కన ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. (Singer Kalpana)
Also Read: Singer Kalpana: టాలీవుడ్ సింగర్ల పరిస్థితి దారుణం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన!!
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత డోర్ కొట్టిన తెరవకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి కల్పన బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉండిపోయింది. అంతేకాదు ఆమె పక్కన స్లీపింగ్ టాబ్లెట్లు కూడా ఉన్నాయి.. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎక్కువ మోతాదులో స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకుందని భావిస్తున్నారు.. ఈ తతంగం అంతా గమనిస్తే మాత్రం తన భర్తకు ఆమెకు మధ్య ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుంది.

రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చి చూడకపోవడం, ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం వెనుక కారణమేంటని పోలీసులు వెతికే పనిలో పడ్డారు.. మరి దీనిపై కల్పన క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. ఇక ఆమె ఆస్పత్రి పాలైందని తెలియగానే తోటి సింగర్స్, కొంతమంది సినీనటులంతా ఆమెను పరామర్శించడానికి వెళ్తున్నారు.ప్రస్తుతం సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.(Singer Kalpana)