Sree Ramachandra: సింగర్ శ్రీరామచంద్ర అంటే అందరికీ తెలుసు.. ఈయన ఇండియన్ ఐడల్ విజేత కూడా..అలాంటి స్టార్ సింగర్ అయినటువంటి శ్రీరామచంద్ర తెలుగు బిగ్ బాస్ రియాల్టీలో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన టాప్ 5 లో ఒకరిగా నిలిచారు.అలాంటి సింగర్ శ్రీరామచంద్ర నిజంగానే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని మోసం చేశారా.. పెళ్లి చేసుకోవాలని నేరుగా ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చి కూర్చుందా..ఇందులో జరిగిన అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Singer Sree Ramachandra who cheated that girl
చాలామంది సెలబ్రిటీలకు వారి జీవితంలో కొన్ని మర్చిపోలేని విషయాలు ఉంటాయి. అలాంటిదే ఒకటి శ్రీరామచంద్ర లైఫ్ లో కూడా ఉందట. అదేంటంటే..అప్పట్లో ఓ అమ్మాయి శ్రీరామచంద్ర తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ నేరుగా సూట్ కేస్ లో బట్టలు సర్దుకొని వచ్చి ఇంట్లోనే కూర్చుందట. అయితే ఈ విషయాన్ని శ్రీరామచంద్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూలో శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. (Sree Ramachandra)
Also Read: Malvi Malhotra: రాజ్ తరుణ్ లవర్ నటి మాల్వి మల్హోత్రా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!
ఓ యువతి నేరుగా మా ఇంటికి బట్టలు సర్దుకుని వచ్చి మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని మా అమ్మతో చెప్పింది.దాంతో మా అమ్మ కంగారుపడి నాకు ఫోన్ చేసింది.ఎందుకంటే ఆ రోజు నేను అసలు ఊర్లోనే లేను.ఏంట్రా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసావట అని అడిగితే నేను చేయలేదమ్మా..ఆమె ఎవరో నాకు తెలియదు అని చెప్పాను. దాంతో ఆ యువతి ఫేస్బుక్ చూపెట్టి మీ అబ్బాయి నాకు మెసేజ్లు చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అందుకే వచ్చేసాను అని చూపెట్టిందట.
ఇక దానికి మా అమ్మ ఇది నా కొడుకు ఫేస్బుక్ అకౌంట్ కాదమ్మా.. ఎవరో నా కొడుకు పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నీకు అలా మెసేజ్లు చేశారు. ఇందులో నువ్వు మోసపోయావ్..నా కొడుకు అకౌంట్ అది కాదు అని చెప్పి ఆ అమ్మాయికి కడుపునిండా భోజనం పెట్టి ఇంటికి పంపించేసిందట.ఇక ఈ విషయం నా జీవితంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటన అంటూ సింగర్ శ్రీరామచంద్ర ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Sree Ramachandra)