Siva Karthikeyan: శివ కార్తికేయన్ ఆస్తులు అన్ని వేల కోట్లా.. అమరన్ తర్వాత అంత పెరిగాయా.?
Siva Karthikeyan: శివ కార్తికేయన్ చాలామందికి ఈయన కమెడియన్ గా, విలన్ గా మాత్రమే ఎక్కువ పరిచయం అయ్యాడు. ఈ మధ్యకాలంలో హీరోగా కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు.అలాంటి శివ కార్తికేయన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా సెటైరికల్ సమాధానం ఇచ్చారు.తనదైనా మాటలతో అందరినీ నవ్విస్తూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఆయన ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Siva Karthikeyan assets are thousands of crores
శివ కార్తికేయన్ తాజాగా అమరన్ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చి అద్భుతమైన హిట్ సాధించాడు.. రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31, 2024లో వచ్చింది.. రియల్ ఆర్మీ ఆఫీసర్ కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్క ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయి ఇండస్ట్రీ హిట్ కొట్టిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రంలో కథానాయికగా సాయిపల్లవి తనదైన శైలిలో నటించి మెప్పించింది..(Siva Karthikeyan)
ఈ సినిమా తర్వాత ఆయన దాదాపు 3 సినిమాలకు కమిట్ అయ్యారు. ఇందులో డైరెక్టర్ ఏఆర్ మురుగదాసుతో ఒక చిత్రం, సుధా కొంగరతో ఒక మూవీ లైన్ లో పెట్టుకున్నారు. అలాంటి శివ కార్తికేయన్ తాజాగా తన గురించి తన ఆస్తి వివరాల గురించి ఒక విషయాన్ని బయట పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది..

అయితే ఇంటర్వ్యూలో మీ ఆస్తి మొత్తం ఎంత ఉందని యాంకర్ ప్రశ్నించగా 45 వేల కోట్ల పైగానే ఉంటుందని అంబానీ కంటే ఎక్కువ ఆస్తి నాకే ఉందని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక శివ కార్తికేయన్ సినిమాల్లో హీరోగా లేటుగా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ గా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.(Siva Karthikeyan)