Smartphone: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ కెమెరాలతో లేజర్ లైట్లను ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్ చేయకూడదు. దీని వలన కెమెరా సెన్సార్ శాశ్వతంగా పాడవుతుంది. లేజర్ లైట్స్ లోని అధిక శక్తి సాంద్రత కారణంగా లెన్స్ సిస్టం సెన్సార్ రెండు కూడా పాడవుతాయి. ఇటీవల స్మార్ట్ ఫోన్స్ ను బైక్ లకు మౌంట్ చేయడం కామన్ అయిపోయింది దీని వలన కూడా కెమెరా దెబ్బతింటుంది. వాహనాలు వేగంగా వెళ్లేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్ స్మార్ట్ఫోన్ కెమెరాని దెబ్బతీస్తాయని టెక్ నిపుణులు అంటున్నారు. సో ఈ పొరపాటు కూడా చేయకుండా చూసుకోండి. ప్రస్తుతం వాటర్ ప్రూఫ్ ఫోన్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
Smartphone camera problems
దీంతో నీటి అడుగున పెట్టి ఫొటోస్ ని తీస్తున్నారు అయితే ఐపీ రేటింగ్ ఉన్నా కూడా కెమెరా పాడవుతుంది. నీటి అడుగున ఎక్కువసేపు ఉంచడం వలన ఫోన్ వేడెక్కిపోతుంది. దీని వలన కెమెరా దెబ్బ తింటుంది. విపరీతమైన ఉష్ణోగ్రతలో కెమెరాను ఉపయోగించడం వలన ఏమవుతుంది అంటే కెమెరా పై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరీ చల్లగా లేదంటే వేడిగా ఉన్న ప్రదేశంలో కెమెరా ఉపయోగించినా దెబ్బతింటుంది.
Also read: Pensions: పెన్షన్లు పంపిణీ మొదలు.. స్వయంగా పెన్షన్లు ఇచ్చిన చంద్రబాబు..!
ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్న టైంలో కెమెరాను ఉపయోగించడం మంచిది కాదు కెమెరా లెన్స్ కి ప్రొటెక్టర్లను ఉపయోగించడం వలన కూడా కొన్ని సందర్భాల్లో కెమెరా నాణ్యత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. లెన్స్ కు ప్రొటెక్టర్లకు మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీల నుండి దుమ్ము కణాలు వెళ్లి లెన్స్ ని దెబ్బతీస్తాయి. సో ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తెలిసి తెలియక ఈ పొరపాట్లు చేశారంటే కెమెరా దెబ్బ తింటుంది. కెమెరా పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి (Smartphone).