Sneha: భర్తతో స్నేహ విడాకులు.. అది పర్సనల్ అంటూ షాక్ ఇచ్చిన స్నేహ.?
Sneha: ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం కామన్ గా మారిపోయింది. ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా విడాకులు అనే పెద్ద డెసిషన్ తీసుకొని సోషల్ మీడియాలో మెయిన్ మీడియా లో వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గానే ధనుష్ ఐశ్వర్య ల విడాకులు మంజూరు అయ్యాయి. అలాగే ఏఆర్ రెహమాన్ సైరా బాను కూడా విడాకులకు అప్లై చేశారు. జీవి ప్రకాష్ సైంధవీలు కూడా డివోర్స్ ప్రకటించారు. జయం రవి, ఆర్తి లు కూడా విడాకులు తీసుకోబోతున్నారు.
Sneha divorce from her husband
ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా విడిపోతున్న సమయంలో గత కొద్ది రోజులుగా ఎంతోమంది సెలబ్రిటీలపై కూడా ఈ విడాకుల రూమర్లు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ డివోర్స్ వార్తలు రెండు సంవత్సరాల నుండి వినిపిస్తున్నాయి. వీళ్లు మాత్రమే కాకుండా శ్రీకాంత్ ఊహ, స్నేహ ప్రసన్న ఇలా కొంతమంది సెలబ్రిటీలపై కూడా ఈ డివోర్స్ రూమర్స్ వినిపించాయి. ఇక శ్రీకాంత్ విడాకులు వార్తలపై ఘాటుగా స్పందించారు.(Sneha)
Also Read: Pushpa-2: పుష్ప-2 లో అనసూయ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. చేసుంటే వేరే లెవల్..?
అలాగే చాలా రోజుల నుండి స్నేహ ప్రసన్న కూడా విడాకుల వార్తలతో మీడియాలో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈ విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని తాజాగా కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ విడాకుల వార్త వినిపించిన ప్రతిసారి స్నేహ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అందరికీ మేము కలిసే ఉన్నాము అని చెబుతుంది. ఇక తాజాగా తాను స్టార్ట్ చేసిన చీరల బిజినెస్ మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో సెలబ్రిటీల విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది.
అయితే ఆ ప్రశ్న గురించి స్నేహ స్పందిస్తూ..వాళ్లు వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారో నాకు తెలియనప్పుడు వారి విడాకుల గురించి మాట్లాడే హక్కు నాకు లేదు.నేను స్పందించలేను అది పూర్తిగా వారి పర్సనల్ అంటూ స్నేహ చెప్పింది. ఇక ఈ మీడియా సమావేశంలో స్నేహ తో పాటు ఆమె భర్త కూడా పాల్గొన్నారు. అలా మరొకసారి స్నేహ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చింది.(Sneha)
https://www.instagram.com/reel/DDEErLXyEaY/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==