Sneha Ullal: పెళ్లైన హీరోతో మళ్లీ పెళ్లి.. స్నేహ ఉల్లాల్ అంతకు తెగించిందా.?
Sneha Ullal: ఐశ్వర్య రాయ్ లాంటి అందంతో జూనియర్ ఐశ్వర్య రాయ్ లాగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ టక్కున స్నేహ ఉల్లాల్ పేరే గుర్తుకొస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు అయినటువంటి సల్మాన్ ఖాన్ ఈమెను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే అప్పట్లో ఐశ్వర్యరాయ్ మీద ఉన్న పగతోనే స్నేహ ఉల్లాల్ ని సల్మాన్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు అంటారు.

Sneha Ullal love that married hero
ఈ విషయం పక్కన పెడితే..స్నేహ ఉల్లాల్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా రాణించింది. ముఖ్యంగా స్నేహ ఉల్లాల్ పేరు చెప్తే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమానే గుర్తుకస్తుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ స్నేహ ఉల్లాల్ కి ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ వంటి రెండు సినిమాలే మంచి పేరు తెచ్చిపెట్టాయి. (Sneha Ullal)
Also Read: Chandramukhi: చంద్రముఖి సినిమాని ఆ తెలుగు హీరో కావాలనే రిజెక్ట్ చేశాడా.?
అయితే స్నేహ ఉల్లాల్ పెళ్లయిన హీరోని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. ఇక ఆ హీరో ఎవరంటే మంచు మనోజ్..అయితే స్నేహ ఉల్లాల్,మంచు మనోజ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. కానీ వీరి మధ్య ఉన్న స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది ఇండస్ట్రీ జనాలు స్నేహ ఉల్లాల్ మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ క్రియేట్ చేశారు.

కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని స్నేహ ఉల్లాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే గతంలో తన బర్త్డే రోజు మనోజ్ ని పిలవగా ఆయన రాకపోవడంతో ఆ కోపంతో స్నేహ ఉల్లాల్ ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద రచ్చ రచ్చ చేసినట్టు కొన్ని వార్తలు వినిపించాయి.(Sneha Ullal)