Sneha Ullal: విడాకులు తీసుకున్న సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్న బాలకృష్ణ హీరోయిన్.?
Sneha Ullal: ఏంటి స్నేహ ఉల్లాల్ పెళ్ళై విడాకులు తీసుకున్న సెలబ్రెటీని పెళ్లి చేసుకోబోతుందా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్లి చేసుకొని ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి.. అసలు స్నేహ ఉల్లాల్ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. నటి స్నేహ ఉల్లాల్.. ఈమెని చూస్తే అచ్చం ఐశ్వర్యరాయ్ లాగే అనిపిస్తుంది.
Sneha Ullal who is going to marry a divorced celebrity
అందుకే అందరూ ఈ నటిని జూనియర్ ఐశ్వర్య రాయ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. గతంలో సల్మాన్ ఖాన్ తో నటించిన స్నేహ ఉల్లాల్ ఐశ్వర్య రాయ్ మీద కోపంతోనే సల్మాన్ ఖాన్ ఈ హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు అంటుంటారు.అయితే అలాంటి స్నేహ ఉల్లాల్ తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా,కరెంట్.. (Sneha Ullal)
Also Read: Samantha: సమంతకు ఫార్మ్ హౌస్ ఇచ్చి ఆ కోరిక తీర్చుకున్న నిర్మాత..?
ఈ రెండు సినిమాలు స్నేహ ఉల్లాల్ కి టాలీవుడ్ లో మంచి బూస్టింగ్ ఇచ్చాయి .కానీ ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు అంతగా పేరు తెచ్చి పెట్టలేదు.అలాగే బాలకృష్ణ హీరోగా చేసిన సింహ మూవీలో కూడా స్నేహ ఉల్లాల్ నటించింది. వరుడు, మడత కాజా,అలా మొదలైంది,కింగ్, నేను మీకు తెలుసా వంటి సినిమాల్లో కూడా స్నేహ ఉల్లాల్ కనిపించింది.
అయితే అలాంటి ఈ బ్యూటీ తాజాగా ఓ పెళ్ళై విడాకులు తీసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే బాలీవుడ్ లో మంచి పేరున్న ఓ ప్రొడ్యూసర్ కొడుకుని స్నేహ ఉల్లాల్ పెళ్లాడబోతుందట. కానీ ఆ ప్రొడ్యూసర్ కొడుకుకి అప్పటికే పెళ్ళై విడాకులు అయినట్టు తెలుస్తోంది. మరి స్నేహ ఉల్లాల్ పెళ్లి వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.(Sneha Ullal)