Sobhita Dhulipalla: వివాదంలో శోభితా ధూళిపాళ్ల.. తెలుగింటి కోడలువేనా అంటూ ఫైర్.?
Sobhita Dhulipalla: శోభిత ధూళిపాళ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న పేరు. ఈమె నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాతే బాగా వైరల్ అయింది. అలాంటి శోభిత సంక్రాంతి సందర్భంగా పెట్టినటువంటి ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతోనే నేటిజన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాలు చూద్దాం.. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి దగ్గరి కుటుంబీకుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
Sobhita Dhulipalla in Controvercy
పెళ్లికి సంబంధించిన ఫోటోలు అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. ధూళిపాళ ముంబైలో పెరిగిన కానీ తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడూ చీరకట్టులోనే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి సమయంలో పెళ్లికి ముందు జరిగే పనులన్నీ పద్ధతిగానే చేసింది. ముఖ్యంగా పెళ్లికి పసుపు దంచడం నుంచి మొదలు అన్ని ప్రోగ్రాంల్స్ లో ఆమె పాల్గొని తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించింది.(Sobhita Dhulipalla)
Also Read: Ajith: శాలిని కంటే ముందే ఆమెను ప్రేమించా.. కానీ డ్రగ్స్ తాగుతూ.?
కానీ ఇదంతా పెళ్లి ఫోటోషూట్ వరకే పరిమితమైందని తాజాగా ఆమె పోస్టు చేసిన ఫోటో ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో ఎర్ర రంగు చీరలో అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ ఒక పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నాగచైతన్య శోభిత కాళ్లకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ సంక్రాంతి సంబరాలు జరిగాయి అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడే ఆమె దొరికిపోయింది. పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాకముందే తన కాళ్లకు ఉన్న మెట్టలను తీసేసి ఆమె కనిపించడంతో నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
తెలుగింట అడుగుపెట్టిన నువ్వు ఇలా రెండు నెలలు కాకముందే మెట్టెలు తీసేసావు అంటూ కామెంట్లు పెడుతూ తిడుతున్నారు. ఎంగేజ్ మెంట్, పెళ్లి వరకు సాంప్రదాయంగా కనిపించావు ఆ తర్వాత అన్ని గాలికి వదిలేసావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది ఆమె ఎలా ఉంటే మీకేంట్రా అంటూ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ఫోటోకు సంబంధించింది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Sobhita Dhulipalla)