Sobhita: శోభిత ప్రెగ్నెంటా.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్…?

Sobhita: నాగచైతన్య పెళ్లి చేసుకున్నప్పటి నుండి శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నాగచైతన్యతో పెళ్లి కాక ముందే శోభిత ధూళిపాళ్ల తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం అని,పెళ్లయ్యాక వెంటనే తల్లి అవ్వాలనే కోరిక ఉందని ఎప్పుడైతే శోభిత చెప్పిందో అప్పటినుండి పెళ్లి కాకుండానే నాగచైతన్యతో శోభిత పిల్లల్ని కంటానంటుంది అంటూ మాట్లాడుకున్నారు.
Sobhita is pregnant
ఇక పెళ్లయ్యాక కూడా శోభిత పిల్లలకి సంబంధించిన రూమర్లు తెరమీద వైరల్ అయ్యాయి.అంతేకాదు శోభిత బేబీ బంప్ బయటపడిందని, శోభిత ప్రెగ్నెంట్ అంటూ పలు రూమర్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే తాజాగా శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య రీసెంట్ గా ఓ వెకేషన్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఆ వెకేషన్లో శోభిత దూళిపాల్ల బేబి బంప్ బయటపడింది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Sobhita)
Also Read: Sobhan Babu: జయలలిత మాత్రమే కాదు ఆ హీరోయిన్ కూడా శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలనుకుందా.?
దీంతో చాలామంది పెళ్లయినకొద్దీ రోజులకే గుడ్ న్యూస్ చెప్పింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేదాకా ఇందులో ఉన్నది ఎంత నిజమో బయటపడదు. నాగచైతన్య షోయు అనే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.(Sobhita)
