Nagarjuna: దానివల్ల చైతూ టార్చర్ అనుభవించాడు.. నాగార్జున మాటలకి కన్నీళ్లు పెట్టిన శోభిత.?
Nagarjuna: ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ మూవీ భారీ హిట్టు కొట్టి 100 కోట్ల దిశగా అడుగులు వేసింది.అయితే ఈ సినిమా హిట్టు కొట్టడంతో దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాదులో నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే ఈ సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా నాగార్జున వచ్చారు. ఇక ఈ సక్సెస్ మీట్ లో నాగార్జునతో పాటు నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల కూడా సందడి చేసింది.

Sobhita shed tears at Nagarjuna words
ఇక సక్సెస్ మీట్ లో భాగంగా నాగార్జున స్టేజ్ ఎక్కి తన కొడుకు నాగచైతన్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. నాగార్జున మాట్లాడుతూ.. నాగచైతన్య తండేల్ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా గుబురు గడ్డం జుట్టును పెంచి వాడి మొహం చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండేది.(Nagarjuna)
Also Read: Mahesh Babu: మహేష్ మామూలోడు కాదు.. పెళ్లికి ముందే నమ్రతకు చిత్రహింసలు.?
ఏరా గడ్డం,జుట్టు వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నావా అంటే అదేం లేదు నాన్న అని చెప్పేవాడు.ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లి వచ్చిన ప్రతిరోజు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగితే లేదు నాన్న అని చెప్పేవాడు. కానీ ఓ రోజు షూటింగ్ కి వెళ్లే ముందు ఈరోజు ఏం సీన్ చేస్తున్నారు అంటే సముద్రం షూటింగ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రోజు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న..

ఆ సముద్రంలో మత్స్యకారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు కూడా అర్థమవుతుంది..అంటూ చాలా బాధగా చెప్పాడు. ఇక నా కొడుకు మాటలకి నాకు కూడా బాధేసింది. కానీ వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది అంటూ నాగార్జున స్టేజ్ పై మాట్లాడడంతో అక్కడే స్టేజ్ దగ్గర కూర్చొని ఉన్న శోభిత ధూళిపాళ్ల మామ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం నాగార్జున మాటలకి శోభిత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.(Nagarjuna)