Devi: హీరోయిన్ల శరీర భాగాలు పార్టులుగా అమ్ముతూ.. ధమాకా డైరెక్టర్ పై సోషల్ యాక్టివిటీస్ట్ ఫైర్.?
Devi: ఈ మధ్యకాలంలో చాలామంది పెద్దపెద్ద హీరోలు, దర్శక నిర్మాతలు హీరోయిన్ల విషయంలో చాలా చులకనగా చూస్తున్నారు. హీరోయిన్ అంటే ఒక ఆట బొమ్మ అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ తంతు ఎప్పటినుంచో ఉంది. అయితే తాజాగా ఒక దర్శకుడు హీరోయిన్ బాడీపై పలు రకాల విమర్శలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు మహిళా సంఘాలు కూడా దీనిపై స్పందించి దారుణంగా తిట్టిపోస్తున్నాయి.
Social activist Devi fire on Dhamaka director
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే త్రినాథరావు. సీనియర్ నటిమని అన్షును స్టేజ్ పైన ఇలా వ్యాఖ్యానించాడు.. అన్షు కొంచెం సన్నబడింది.. తిని అది కొంచెం పెంచమ్మ.. మన తెలుగు ఇండస్ట్రీలో అవి కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి ” అంటూ మాట్లాడారు. స్టేజ్ మీద తన నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా, ఒక మహిళను అలా వర్ణించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. దీనిపై తాజాగా సోషల్ మీడియా యాక్టివిస్టు దేవి స్పందిస్తూ డైరెక్టర్ పై విరుచుకుపడింది. (Devi)
Also Read: Ajith: శాలిని కంటే ముందే ఆమెను ప్రేమించా.. కానీ డ్రగ్స్ తాగుతూ.?
ఆ డైరెక్టర్ మాట్లాడింది ముమ్మాటికి తప్పే బలిసి, మదమెక్కి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయింది. ఒకప్పుడు కాలేజ్ గోడలపై అమ్మాయిల బొమ్మలు వేసి ఏడిపించేవారు. కానీ ఇప్పుడు నిర్మాతలు, డైరెక్టర్స్ స్టేజ్ మీద నోటికి ఏది వస్తే అది వాగుతూ వ్యాపారం చేస్తున్నారని చెప్పింది. కెమెరాకు ముందు ఒకటి జరిగితే కెమెరాకు లోపల మరోటి జరుగుతుందని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఈ తంతు మారడం లేదని చెప్పింది. అల్లు అర్జున్ కేసులో కూడా ఈ విధంగానే జరిగిందని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం చాలామంది మహిళలను ఇండస్ట్రీలో శరీరాలు అమ్ముకునే వారీగా చూపిస్తున్నారని, ఇండస్ట్రీలో స్త్రీల శరీరాలపై దోపిడీ జరుగుతోందని, హీరోలను వీరత్వం ఉన్నవారీగా చూపిస్తున్నారని ఇదంతా ప్రేక్షకులు చూడడం లేదా అంటూ మండిపడింది. మహిళ శరీరం అమ్ముకునే సరుకుగా ఉంటే ప్రేక్షకులు కొనుక్కునే వారిగా ఉంటున్నారని , శరీరాలను ముక్కలు ముక్కలుగా అమ్ముకుంటూ బాడీ పార్ట్స్ ని హైలైట్ చేస్తూ చూపిస్తున్నారని ఆమె మండిపడింది.(Devi)