Cm Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్… డిసెంబర్ 9 పై సోనియమ్మ సంచలన నిర్ణయం ?
Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో గత మూడు రోజుల నుంచి తెలంగాణ ప్రజా పాలన ఉత్సవాలను… నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అలాగే ఇవాల్టి రోజున.. తెలంగాణ తల్లి కొత్త రూపంతో ఉన్న విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. Cm Revanth Reddy
sonia gandhi big shock Cm Revanth Reddy
ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. డిసెంబర్ 9 అంటే నేడు సోనియా గాంధీ బర్త్ డే. ఆమె బర్త్డే సందర్భంగా తెలంగాణకు వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు చెప్పారు. కానీ ఈ విషయంలో సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ… రేవంత్ రెడ్డి కి షాక్ ఇచ్చారట. Cm Revanth Reddy
Also Read: YCP: జనసేనలోకి విజయ సాయి, ధర్మాన… షాక్ లో జగన్ ?
డిసెంబర్ 9 కార్యక్రమానికి రావాలని… ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఆహ్వానించారు. కానీ రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీ సుముకత చూపించలేదట. దీంతో రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురయిందట.అయితే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని గ్రహించిన అగ్రనేతలు…. ఈ కార్యక్రమానికి రావడం లేదని ఈ సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ విగ్రహా ఆవిష్కరణ జరుగుతోందట. Cm Revanth Reddy