Sonu Sood: సోనూ సూద్ భార్య సోనాలి కారు ప్రమాదం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదకరం!!

Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ ఇటీవల ముంబై-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. సోనాలి తన సోదరి మరియు మేనల్లుడితో కలిసి MG ZS EV అనే electric car లో ప్రయాణిస్తుండగా, వారి వాహనం ఒక ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయినా, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడం గమనార్హం.
Sonu Sood shares safety advice
ఈ ప్రమాదం గురించి స్పందించిన సోనూ సూద్, “సీట్ బెల్ట్ వేసుకుని ఉండడం వల్లే వారు ప్రాణాలతో బయటపడ్డారు” అని చెప్పారు. అతను వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు కూడా తప్పనిసరిగా seatbelt వేసుకోవాలన్న సూచన చేశాడు. “మనం కేవలం ముందు కూర్చున్నపుడే కాదు, వెనుక సీట్లోనూ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి” అని సోనూ హెచ్చరించారు.
వాహనంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ road safety గురించి అప్రమత్తంగా ఉండాలని సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని, అందుకే జాగ్రత్త అవసరం అని తెలిపారు. రోడ్డు భద్రతను నిర్లక్ష్యం చేయడం జీవితానికి ప్రమాదకరం అని ఆయన తెలిపారు.
“ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనం నడపాలి, తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఇది మన కుటుంబ భద్రత కోసం ఎంతో కీలకం” అని సోనూ సూద్ అన్నారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు seatbelt ప్రాముఖ్యతను గుర్తించాలన్నది ఆయన అభిప్రాయం.