Soundarya: సినిమా కోసం తన్నులు తిన్న సౌందర్య..భయపడి ఏడుస్తూ.?
Soundarya: ఏంటి ఓ సినిమా కోసం సౌందర్య నిజంగానే తన్నులు తిన్నదా.. సినిమాలో భయపడి ఏడుస్తూ సినిమా చేయనని వెళ్లిపోయిందా.. మరి ఇంతకీ సౌందర్య అంతలా భయపడ్డ ఆ సినిమా ఏంటి.. ఎందుకు తన్నులు తిన్నది అనేది ఇప్పుడు చూద్దాం.కొంతమంది నటీనటులు కొన్ని సినిమాల్లో నటిస్తే చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. అలాంటి వారిలో సౌందర్య కూడా ఒకరు. అయితే ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అదరగొట్టిన సౌందర్య ఒక సినిమా సమయంలో మాత్రం చాలా ఏడ్చిందట.

Soundarya who kicked herself for the film
ఈ పాత్ర చేయడం నావల్ల కాదు బాబోయ్ అని డైరెక్టర్ దగ్గర మొరపెట్టుకుందట.మరి ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే అంతఃపురం.. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన అంతఃపురం సినిమా అప్పట్లోనే చాలా వైల్డ్ యాంగిల్ లో చూపించారు డైరెక్టర్. ఇక ఈ సినిమా లో రాయలసీమలో జరిగే ఫ్యాక్షనిజం,హత్యలు వంటివి అన్నీ చూపించారు. అయితే ఇది చాలా వైల్డ్ గా ఉండడంతో ఇందులో నటించడం నా వల్ల కాదు అని సౌందర్య చెప్పిందట.(Soundarya)
Also Read: Surekha Vani: డైరెక్టర్ తో సురేఖ వాణి డేటింగ్.. ఐలాండ్ కి ఎంజాయ్.?
కానీ సౌందర్య చెప్పిన మాటలను డైరెక్టర్ వినకుండా నువ్వు ఈ సినిమా తర్వాత మంచి గుర్తింపు పొందుతావు అని చెప్పారట. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సౌందర్య ఎందుకు ఏడ్చింది అంటే.. అంతఃపురం సినిమా మొత్తం సౌందర్య చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న సౌందర్య అక్కడ జరిగే పరిస్థితులు నచ్చక అవి ఆపేయాలని చెబుతుంది.కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వాటిని ఆపెయ్యరు.

దాంతో వీటన్నింటికీ నా కొడుకును దూరంగా పెంచుతాను అని తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుండగా ప్రకాష్ రాజ్ అడ్డుకొని అక్కడే ఉండాలని చిత్రహింసలకు గురిచేస్తాడు. అలా సౌందర్య ఎన్నో ఇబ్బందులు పడి చివరికి తన్నులు కూడా తింటుంది. అయితే ఈ సీన్ చేసే సమయంలో కొన్ని కొన్ని సార్లు సౌందర్యకు నిజంగానే దెబ్బలు తగిలాయట.దాంతో సౌందర్య భయపడి సినిమా వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పిందట.కానీ డైరెక్టర్ మరీ మరీ చెప్పడంతో చేసేదేమీ లేక సినిమా మొత్తం పూర్తి చేసింది. ఇక సౌందర్య పడ్డ కష్టానికి ఫలితంగా ఈ సినిమాకి ఏకంగా 9 అవార్డులు వచ్చాయి.(Soundarya)