Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం ?
Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదు అనడం సరైంది కాదని సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని తెలిపారు. నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరుగనుంది.

Speaker takes sensational decision on defected MLAs
ఈ తరుణంలోనే… స్పీకర్ తరఫున నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీ. పది మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు.
పిటిషనర్లు దురుద్దేశంగా వ్యవహరిస్తున్నారు.. స్పీకర్ ను ఆశ్రయించిన 20 రోజులకే బీఆర్ఎస్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారన్నారు.
KCR: గజ్వేల్ లో పంచాయితీ…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందా ?
అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని తెలిపారు. స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని తెలిపారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లలో పస లేదని, వాటిని తిరస్కరించాలని.. పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయండి అని సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి.
Telangana: బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి చర్చలు ?