Sr. NTR: రెండో భార్యతో పిల్లల కోసం ఎన్టీఆర్ స్టెరాయిడ్స్.. హరికృష్ణ షాకింగ్ కామెంట్స్.?
Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను మార్చిన ఘనుడు. కేవలం సినిమాలకే పరిమితం కాదు, రాజకీయాల్లో కూడా రాటుదేలి రాణించగలరని నిరూపించాడు. ఈయన రాజకీయాల వల్లే సినిమా వాళ్ళు తరచు రాజకీయాలకు రావడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా రాజకీయాల్లో కూడా పెద్ద స్టార్ అయ్యారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చి ఎన్నో పథకాలు తీసుకువచ్చి పేద ప్రజల దేవుడయ్యారు.
Sr.NTR steroids for kids with second wife Harikrishna shocking comments
అలాంటి ఆయన ప్రకటించిన కొన్ని పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అలా ఎన్టీఆర్ తాను ఎదగడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి సినిమా ఇండస్ట్రీని కూడా అద్భుతంగా ఎదిగేలా చేశారు. ఆయన కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే బసవతారకమును పెళ్లి చేసుకుని మొత్తం 12 మంది పిల్లలను కన్నారు. ఇందులో 8 మంది కుమారులు అవ్వగా, మరో నలుగురు కుమార్తెలు.. (Sr.NTR)
Also Read: Saif Ali Khan: పనిమనిషితో ఎఫైర్ వల్లే సైఫ్ అలీ ఖాన్ ని చంపాలనుకున్నారా..?
ఇక చివరికి బసవతారకం 1985లో క్యాన్సర్ తో మరణించడం వల్ల, ఆమెకు గుర్తుగా ఒక క్యాన్సర్ ఆసుపత్రిని బసవతారకం పేరుతో స్థాపించారు. ఎప్పుడైతే భార్య చనిపోయిందో అప్పటినుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అనే మహిళకు దగ్గరయ్యారు. చివరికి ఆమెతో పిల్లలు కందామని కూడా ప్రయత్నం చేశారు. అప్పటికి ఆయన వయసు 70 ఏళ్లకు పైగానే ఉంది. ఎలాగైనా ఆమెతో పిల్లలు కనలని ఆరాటపడి స్టెరాయిడ్స్ తీసుకున్నాడట..
దీంతో సీనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం క్షీణించి లేవలేని పరిస్థితికి వచ్చారట. అలా ఆయన మరణించారని హరికృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఇంటర్వ్యూ క్లిప్పు మరోసారి సోషల్ మీడియా వైరలవ్వడంతో ఎన్టీఆర్ ఆ విధంగా చనిపోయారా అంటూ చాలామంది బాధపడుతున్నారు. అంతేకాదు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ అభిమానులు తిట్టుకుంటున్నారు.(Sr.NTR)