Sree Leela : వరుస ఫ్లాపులతో శ్రీలీల.. మరో కృతి శెట్టి లా తయారవుతుందా!!

Sree Leela: టాలీవుడ్‌లో హీరోయిన్లకు స్టార్‌డమ్ ఎక్కువ రోజులు నిలబడడం చాలా కష్టం. రెండు మూడు వరుస హిట్స్‌తో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న వారు కొద్ది కాలంలోనే అవకాశాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు కెరీర్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కృతి శెట్టి “ఉప్పెన” సినిమా తర్వాత వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. కానీ తరువాత ఆమె సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి.
Sree Leela Hits and Flops Analysis
ఇప్పుడీ పరిస్థితి శ్రీలీలకు కూడా ఎదురవుతోంది. “దుమ్ము ధూళి” స్టార్‌గా మారిన ఆమె వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. “స్కంద,” “ఆదికేశవ,” “ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్” వంటి సినిమాలు నిరాశపరిచాయి. “గుంటూరు కారం” ఓ హిట్ అయినా, శ్రీలీలకు పెద్దగా లాభం కాలేదు. ప్రస్తుతం “పుష్ప 2″లో ఒక స్పెషల్ సాంగ్‌తో కన్పించనుంది. అలాగే, నితిన్ సరసన “రాబిన్ హుడ్” సినిమాలో నటిస్తోంది. కానీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా నిలవాలంటే మంచి కథలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.
శ్రీలీల ప్రస్తుతం మాస్ హీరో రవితేజతో “మాస్ జాతర”లో నటిస్తోంది. అలాగే, బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆమెకి భారీ ఆశలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఆమెకు తిరిగి గ్లామర్ తేవగలవా? అన్నది వేచి చూడాలి.
ఇటీవల హీరోయిన్ల కెరీర్‌లు త్వరగా పతనం కావడానికి ప్రధాన కారణం వరుస ఫ్లాపులే. ఒకటి రెండు హిట్స్‌తో స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసినా, సరైన కథలు ఎంచుకోకపోతే అవకాశాలు తగ్గిపోతాయి. శ్రీలీల ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండకపోతే, ఆమెకు కూడా కృతి శెట్టి మాదిరిగానే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవచ్చు.