Sreeleela: సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో శ్రీలీల ఎఫైర్.. పబ్లిక్ గా ఆ పని చేస్తూ మీడియాకి దొరికి?
Sreeleela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వారందరిలో కెల్లా అద్భుతమైన గుర్తింపుతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీ లీల. ప్రస్తుతం ఈమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. చిన్న వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా స్పీడ్ గా స్టార్ హీరోయిన్ అయింది. అలాంటి శ్రీలీలా తాజాగా పుష్ప2 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.
Sreeleela affair with Saif Ali Khan son
అలాంటి ఈమె బాలీవుడ్ స్టార్ నటుడి కొడుకుతో ఆ విధంగా ఉంటూ మీడియా కంటపడింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..హీరోయిన్ శ్రీలీలా పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా హీరో కంటే ఎక్కువ హీరోయిన్ కి గుర్తింపు లభించింది.(Sreeleela)
Also Read: Naga Vamsi: రేవంత్ రెడ్డిని కెలికిన నాగ వంశీ.. నోటిదూల ఎక్కువే!
ఆ తర్వాత ఈమె యాక్టింగ్ నటన టాలెంట్ తో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో జతకడుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ పుష్ప2 సినిమాలో కిస్సిక్ అనే పాటతో చాలా పాపులర్ అయింది. టాలీవుడ్ కే పరిమితమైన ఈమె ఇమేజ్ ఇప్పుడు ఈ సాంగ్ ద్వారా పాన్ ఇండియా లెవెల్ కు చేరింది. ఆమె గ్రేస్ చూసినటువంటి సినీ ఇండస్ట్రీ వారంతా వరుసగా అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అలాంటి ఈమె తాజాగా సైఫ్ ఆలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్ తో చాలా గ్లామర్ గా ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించింది. అంతేకాదు వీరిద్దరూ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వారి స్నేహాన్ని కొనసాగిస్తున్నారట. వీరి మధ్య నిజంగానే స్నేహం ఉందా లేదంటే వీరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా శ్రీలీలా ఆల్ ఇండియా స్టార్ అయిందని చెప్పవచ్చు.(Sreeleela)