Sreeleela Instagram: అభిమానులకు ట్రీట్.. శ్రీలీల తాజా ఇన్‌స్టా ఫొటోలు వైరల్!!

Sreeleela Instagram: యువ హీరోయిన్లలో శ్రీలీల తనదైన గుర్తింపును తెచ్చుకున్న నటి. రవితేజ హీరోగా నటించిన “ధమాకా” సినిమా ఘనవిజయం సాధించడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ, నటించిన చిత్రాల్లో “భగవంత్ కేసరి” తప్ప మిగతావన్నీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ, టాలీవుడ్‌లో ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు.
Sreeleela Instagram Post Wins Hearts
తాజాగా శ్రీలీల “పుష్ప 2” సినిమాలో అల్లు అర్జున్‌తో ఐటమ్ సాంగ్ చేయడం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాట వల్ల ఆమెకు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లోనూ విపరీతమైన ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా మారిన శ్రీలీల, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించనుంది.
ఇక శ్రీలీల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె రెడ్ కలర్ డ్రెస్ ధరించి అనేక స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు సరదాగా “ఫోన్ టైమర్ సెట్ చేయడానికి చాలా రోజులు పట్టింది” అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో తన అభిమానులను మిస్ అయ్యాను అని కూడా చెప్పింది.
చివరి ఫోటోలో శ్రీలీల కాస్త ఎమోషనల్ లుక్ ఇచ్చింది. దీనిపై స్పందిస్తూ, “3 సెకండ్స్ టైమర్ పెట్టాలా, 5 సెకండ్స్ టైమర్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా ఫోటో క్లిక్ అయింది” అని సరదాగా కామెంట్ చేసింది. శ్రీలీల క్యూట్ ఫోటోలు మాత్రమే కాదు, ఫన్నీ క్యాప్షన్స్ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.