Sreeleela: నెమలి లాంటి నాట్యం.. హంస లాంటి సోయగం.. యూత్ ను షేక్ చేస్తున్న శ్రీలీల నయా పోజ్!!

Sreeleela: టాలీవుడ్ లో తన డాన్స్, గ్లామర్తో పాటు డాన్స్ లతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల… ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇతర పరిశ్రమలవైపూ దూసుకుపోతోంది. ఆమె డాన్స్ చూస్తే నెమలిలా పూరి విప్పినట్లు ఉంది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మాటలతో, చూపులతో మత్తెక్కించే ఈ బ్యూటీకి ఇండస్ట్రీలో అవకాశాలు వరుసగా వస్తున్నాయి.
Sreeleela viral yellow saree photos
తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న ఫోటోను షేర్ చేయగా, అది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ ఫోటోలో ఆమె నాభిని ఎలిగెంట్‌గా హైలైట్ చేస్తూ ఇచ్చిన స్టైల్‌ష్ పోజులకు అభిమానుల స్పందన పెరిగిపోతోంది. “నెమలిపురి విప్పినట్లు ఉంది ఈ లుక్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకుముందు టాలీవుడ్‌లో ధమాకా’, ‘స్కంద’ వంటి సినిమాల్లో మెరిసిన శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి మధ్య డేటింగ్ అంటూ గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.
అయితే ఆ చిత్రం ‘ఆషికి 3’ అనే బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీలో భాగమని, కానీ కథ మాత్రం కొత్తదే అని మేకర్స్ స్పష్టం చేశారు. శ్రీలీల ఇప్పుడు మూడు ఇండస్ట్రీలలో బిజీగా ఉండటం చూస్తుంటే ఆమె పాన్ ఇండియా స్టార్‌గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.