Kavya Maran: ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో SRH ఓనర్ కావ్య మారన్ డేటింగ్.. త్వరలోనే పెళ్లి.?

Kavya Maran: ఐపీఎల్ టీమ్స్ లో ఎస్ ఆర్ హెచ్ టీం కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఈ క్రికెట్ టీం చాలా పాపులర్ అయింది. అయితే ఈ ఎస్ ఆర్ ఎస్ టీం ఓనర్ కావ్య మారన్ తన తండ్రి తాతల నుండి వస్తున్న 33 వేల కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ఇక ఐపీఎల్ వచ్చిందంటే చాలు కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటాయి. కుర్రాళ్ల క్రష్ గా మారిపోయిన ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీం ఓనర్ కావ్య మారన్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
SRH owner Kavya Maran is dating that music director
అదేంటంటే కావ్య మారన్ పై ఇప్పటికే పలు డేటింగ్ రూమర్లు వినిపించాయి. క్రికెటర్స్ లో ఉన్న కొంత మందితో అలాగే ఎస్ఆర్ఎస్ టీం లో ఆడుతున్న కొంతమంది క్రికెటర్లతో కూడా కావ్యమారన్ కి డేటింగ్ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా కావ్య మారన్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉంది అంటూ కొన్ని మీడియా వెబ్సైట్లు బహిరంగంగానే రాస్తున్నాయి.(Kavya Maran)
Also Read: Naga Vamsi: హీరోయిన్ తో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎఫైర్.. దుబాయ్ లో అడ్డంగా బుక్కయ్యాడుగా.?
ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుధ్ రవిచంద్రన్. అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.ఈయన తన మ్యూజిక్ తో సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి అనిరుధ్ కి ఇప్పటికే కీర్తి సురేష్,ఆండ్రియా వంటి హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్లు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కావ్యమారన్ సన్నిహితులు అలాంటిదేమీ లేదు.కావ్య మారన్ అనిరుధ్ రవిచంద్రన్ ఇద్దరు మంచి స్నేహితులు. అంతకుమించి వీరి మధ్య ఏ బంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.(Kavya Maran)