SRH Players: రిసెప్షన్‌లో SRH సందడి.. MLA కూతురు రిసెప్షన్ ఆటగాళ్ల హడావిడి!!

SRH Players: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్‌ల వివాహ రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ క్రికెటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్‌లు హాజరయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
SRH players attend Hyderabad wedding reception
ముఖ్యంగా ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మ నేరుగా నితేష్‌ను కలిసి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో నితేష్‌కు SRH ఆటగాళ్లతో సంబంధాలు ఉన్నాయా? లేదా MLA కొత్త ప్రభాకర్ రెడ్డికి హైదరాబాద్ ఆటగాళ్లతో పరిచయముందా? అనే ఊహాగానాలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి.
ఏది ఏమైనా SRH ఆటగాళ్ల హాజరుతో ఈ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణ వచ్చిందనే చెప్పాలి. ఈ వేడుకకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే, IPL 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో SRH జట్టు తలపడనుంది. ఇప్పటికే కొంతమంది SRH ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. గతేడాది ఫైనల్‌కు చేరిన SRH, ఈసారి IPL కప్ గెలవాలని ఆతృతగా ఎదురు చూస్తోంది.