Sridevi: చెల్లెలి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీదేవి నిజమేనా.?
Sridevi: జేడీ చక్రవర్తి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టి చివరికి హీరోగా మంచి పాపులర్ కి సంపాదించుకున్నారు. అలాంటి ఈయన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివ అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి పేరు అప్పట్లో ఎంతో పాపులర్ అయింది.. ఈ విధంగా శివాజీ చిత్రంతో అద్భుతమైన హిట్ సాధించడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమా దెబ్బతో జేడీ చక్రవర్తి లైఫ్ మారిపోయింది.
Sridevi wanted to marry her sister boyfriend
కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కూడా అనేక పాత్రల్లో చేస్తూ దూసుకెళ్లారు. అలా శివాజీ చిత్రం తర్వాత మనీ మనీ, వన్ బై టు, గులాబీ వంటి చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నారు. ఇదే తరుణంలో సత్య అనే చిత్రం హిందీ, తెలుగు భాషల్లో సంచలనమైన విజయం సాధించింది.. అలాంటి జేడీ చక్రవర్తి కేవలం నటుడి గానే కాకుండా డైరెక్టర్ గా కూడా పలు చిత్రాలు చేశాడు.(Sridevi)
Also Read: SSMB29: మహేష్ – రాజమౌళి సినిమాలో పృద్వీరాజ్ సుకుమారన్ రోల్.. ఫుల్ క్లారిటీ ఇదే!!
అలాంటి ఈ హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఒక స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టారని అన్నారు. ఆ హీరోయిన్ కూడా అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అని తెలియజేశారు. ఇంతకీ ఆవిడ ఎవరయ్యా అంటే అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి.. ఓసారి జేడీ చక్రవర్తి హీరోయిన్ మహేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. శ్రీదేవి మహేశ్వరి దగ్గరి రిలేషన్స్.. ఇదే తరుణంలో మహేశ్వరి వాళ్ళ ఇంట్లో శ్రీదేవి తల్లిగారు ఉన్నారట. అక్కడికి జేడీ వెళ్లగానే టక్కున పరిగెత్తుకుంటూ వచ్చి తనని చూసి కాసేపు మాట్లాడి మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు అని ప్రపోజల్ పెట్టిందట.
దీంతో జేడీ చక్రవర్తి షాక్ అయిపోయారట.. అయితే అప్పటికి శ్రీదేవికి కాస్త హెల్త్ ప్రాబ్లం ఉందని జేడీకి తెలిసింది.. దీంతో ఆయన చాలా సైలెంట్ అయిపోయి ఆమెకు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయారట.. ఈ విధంగా జేడీ చక్రవర్తి శ్రీదేవిని పెళ్లి చేసుకునే అవకాశాన్ని మిస్ అయ్యారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.ఇక చెల్లెలి ప్రియుడు అనడానికి కారణం అప్పట్లో జేడీ చక్రవర్తికి శ్రీదేవి చెల్లెలు అయినటువంటి నటి మహేశ్వరి కి మధ్య సంథింగ్ సంథింగ్ ఏదో ఉంది అంటూ వార్తలు వినిపించాయి.(Sridevi)