Sruthi Haasan: డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిన శృతిహాసన్.. సీక్రెట్ డేటింగ్.?


Sruthi Haasan dating with that star Director

Sruthi Haasan: ఏంటి శృతిహాసన్ ఆ డైరెక్టర్ కాపురంలో చిచ్చు పెట్టిందా..ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. శృతిహాసన్ ఎందుకు ఆయన కాపురంలోకి తొంగి చూసింది..అసలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. సౌత్ హీరోయిన్ శృతిహాసన్ గత ఏడాది వరకు శాంతాను హాజరికతో సహజీవనం చేసింది. ఒకే ఇంట్లో ఉంటూ వీళ్ళిద్దరూ డేటింగ్ చేశారు. అయితే పెళ్లి ప్రశ్న ఎదురైనప్పుడు మాత్రం దాన్ని దాటవేశారు.

Sruthi Haasan dating with that star Director

కానీ గత ఏడాది వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.అలా ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆమె ఏం మాట్లాడిందంటే.. రీసెంట్ గా శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు రజినీకాంత్ అంటే ఇష్టమని,ఆయనని చూసి జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాను అని, అలాగే ఆయన యాక్టింగ్ కి కూడా చాలా ఇంప్రెసింగ్ గా ఉంటుందని, ఆయన హార్డ్ వర్క్ వల్లే అంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. (Sruthi Haasan)

Also Read: Jr NTR: ఎన్టీఆర్ పెళ్లి ముచ్చట్లు చెప్పిన బావమరిది.. పెళ్లి చూపుల్లో అలా చేశారంటూ.?

ఇక రజినీకాంత్ కూలీ సినిమాలో శృతిహాసన్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ కూలి మూవీకి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అయితే అదే ఇంటర్వ్యూలో మీకు నచ్చిన దర్శకుడు ఎవరు అని ప్రశ్న అడగగా.. నాకు లోకేష్ కనగరాజ్ అంటే ఇష్టం అని చెప్పడంతో చాలామంది షాక్ అయిపోయారు. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ శృతిహాసన్ డేటింగ్ చేస్తున్నారని,గత కొద్ది రోజులుగా వీరి మధ్య ఎఫైర్ వార్తలు వినిపిస్తున్నాయి.

Sruthi Haasan dating with that star Director

దాంతో పెళ్లైన లోకేష్ కనగరాజ్ కాపురంలో శృతిహాసన్ చిచ్చు పెట్టిందని, పెళ్లై పిల్లలున్న డైరెక్టర్ పై శృతిహాసన్ కి ఇష్టం ఏంటి అని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంతేకాదు డైరెక్టర్ కాపురంలో శృతిహాసన్ చిచ్చు పెట్టింది అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ఆ మధ్యకాలంలో ఇనిమోల్ అనే మ్యూజిక్ వీడియోలో లోకేష్ కనగరాజ్ శృతిహాసన్ చాలా బోల్డ్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. అప్పటినుండే వీరి మధ్య ఈ డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.(Sruthi Haasan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *