Sruthi Haasan: శృతిహాసన్ డబ్బులు కొట్టేసిన స్టార్ హీరోయిన్.. అన్ని కోట్లా.?
Sruthi Haasan: ఏంటి శృతిహాసన్ డబ్బులు ఆ స్టార్ హీరోయిన్ కొట్టేసిందా.. ఇంతకీ ఈ హీరోయిన్ డబ్బులు వేరే హీరోయిన్ కొట్టడం వెనుక ఉన్న కారణం ఏంటి..అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.శృతిహాసన్ డబ్బులు వేరే హీరోయిన్ కొట్టేసింది అంటే దొంగతనం చేసిందని కాదు.. ఈ హీరోయిన్ కి వచ్చే ఆఫర్ మరో హీరోయిన్ కొట్టేసినట్టు. ఇక అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్గా అడివి శేష్ కొత్త మూవీ డెకాయిట్ కి సంబంధించిన హీరోయిన్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
Sruthi Haasan is the star heroine who stole money
అయితే ఈ పోస్టర్లో కొత్త హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించింది. అయితే గతంలో శృతిహాసన్ అడివి శేష్ కాంబినేషన్లో డెకాయిట్ మూవీ వస్తుందని శృతిహాసన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.కానీ సడన్గా శృతిహాసన్ ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఇక వార్తలు నిజమే అన్నట్లుగా రీసెంట్గా శృతిహాసన్ ని తప్పించి ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నట్టు హీరోయిన్ కు సంబంధించిన ఆఫీషియల్ మ్యాటర్ ని కన్ఫామ్ చేసేసారు మూవీ మేకర్స్.(Sruthi Haasan)
Also Read: Anchor Pradeep: ఆ హీరోయిన్ తో ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాసిన యాంకర్ ప్రదీప్.?
అయితే డెకాయిట్ మూవీ శృతిహాసన్ పాత్రలో సహనటుడు వేలు పెట్టడం వల్ల అది నచ్చని శృతిహాసన్ సినిమా నుండి తప్పుకుందట. అయితే ఆ సినిమాకి ముందుగానే శృతిహాసన్ దాదాపు 2.5 కోట్ల పారితోషకాన్ని ఫిక్స్ చేసుకుందట. కానీ శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో షూటింగ్ లేట్ అవుతుందనే కారణంతో వెంటనే మృణాల్ ఠాకూర్ కి శృతిహాసన్ కి ఒప్పుకున్న రెమ్యూనరేషన్ ని ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్.
అయితే మృణాల్ ఠాకూర్ కి శృతిహాసన్ అంత రెమ్యూనరేషన్ ఇచ్చే వారు కాదు.కానీ హీరోయిన్ లేకపోతే షూట్ లేట్ అవుతుంది కాబట్టి శృతిహాసన్ కి ఎంత ఒప్పుకున్నారో మృణాల్ కి కూడా అంతే ఇచ్చారట. ఇక ఈ విషయంలో శృతిహాసన్ తప్పుకోవడంతో ఆమెకి రావాల్సిన కోట్లు మృణాల్ ఠాకూర్ లాగేసుకున్నట్లు అయింది.(Sruthi Haasan)