Sruthi Haasan: పెళ్లి కాదు అందరితో ఎఫైర్స్ పెట్టుకోవడం ఇష్టం శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్.?

Sruthi Haasan: ప్రస్తుతం ఇండియాలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న హీరో ఎవరయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కమల్ హాసన్.. పాన్ ఇండియా స్థాయి సినిమాలు రాకముందే ఈయన పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించారు. అలాంటి ఆయన నట వారసురాలిగా శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాంటి శృతిహాసన్ ఇండస్ట్రీలో స్టార్ గా మారడానికి చాలా టైం పట్టింది.

Sruthi Haasan likes to have affairs with everyone not marriage

Sruthi Haasan likes to have affairs with everyone not marriage

ముఖ్యంగా ఈమె కొత్తగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఐరన్ లెగ్ గా పేరు సంపాదించుకుంది. అయినా శృతిహాసన్ మాత్రం వచ్చిన ఆఫర్ ను వదలకుండా ముందుకు వెళ్లి చివరికి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ అనగనగా ఒక ధీరుడు అనే సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. (Sruthi Haasan)

Also Read: Daggubati Abhiram: గుడ్ న్యూస్.. రానా కంటే తండ్రైన దగ్గుబాటి అభిరామ్..?

ఈ మూవీ తర్వాత శృతి హాసన్ కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాంటి శృతిహాసన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ తోటి హీరోయిన్స్ అంతా పెళ్లి చేసుకున్నారు..మీరు ఎప్పుడు చేసుకుంటారని అడగ్గా.. నాకు పెళ్లంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ చెప్పుకొచ్చింది. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని మార్పులు వస్తూ ఉంటాయి.

Sruthi Haasan likes to have affairs with everyone not marriage

నేను పెళ్లి కంటే ఎక్కువగా రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉండడానికి ఇష్టపడతాను. చుట్టూ ఉండే వారితో ఎక్కువ చనువుగా ఉండాలనుకుంటాను. పెళ్లనేది టైం వచ్చినప్పుడు అవుతుంది. ఒకవేళ ముందు ముందు జీవితంలో నాకు ఎవరైనా నచ్చితే వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. నా లైఫ్ లో నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉంటానని చెప్పడంతో ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Sruthi Haasan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *