SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి సినిమా.. అభిమానులను నిరాశపరుస్తున్న న్యూస్!!

SSMB 29: దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB 29 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన సన్నివేశాల్లో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు రాజమౌళి ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
SSMB 29 Won’t Have Two Parts
ఈ మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రాజమౌళి గతంలో బాహుబలి సినిమాతో రెండు పార్ట్‌ల ట్రెండ్‌ను ప్రారంభించగా, RRR తర్వాత కూడా ఈ కాన్సెప్ట్ కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం SSMB 29 రెండు భాగాలుగా కాకుండా ఒకే పార్ట్‌గా ఉండనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా త్వరలో విడుదల కానుందని సమాచారం.
ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రముఖ టెక్నీషియన్‌లను రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకువచ్చారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి, ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ లెవెల్ మ్యూజిక్ అందించనున్నారు.
ప్రస్తుతం రాజమౌళి సినిమా యొక్క థీమ్, కథ గురించి ఎప్పుడు ప్రకటన చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే SSMB 29 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేసింది. మరి రాజమౌళి ఈసారి ప్రేక్షకులకు ఎలాంటి వండర్ చూపించబోతున్నాడో వేచి చూడాలి!