Jr.NTR: Jr.ఎన్టీఆర్ పొట్టోడు.. దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..?
Jr.NTR: ఇండస్ట్రీలో ఎంతోమంది మల్టీ టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు.. అలాంటివారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటుడు రవిబాబు..ఈయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారు.. అలాంటి రవిబాబు విలన్, కమెడియన్, ఇలా ఏ క్యారెక్టర్ అయినా నటించడం కాదు అందులో దూరిపోతాడు. అయితే రవిబాబు ఏ విషయమైనా ఎవరికీ భయపడకుండా ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు.. అలాంటి ఈయన అప్పట్లో ఒక హీరో గురించి మాట్లాడుతూ పొట్టోడు అంటూ ప్రస్తావించిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Star director who insulted Jr.NTR
అంతేకాదు ఈ పొట్టోడు అనే పదాన్ని తాజాగా తెలుగు ఇండస్ట్రీలోని ఒక హీరోకు ఆపాదించి కొంతమంది, ఆయననే నిందించారని సోషల్ మీడియా వేదికగా వార్త క్రియేట్ చేశారు. చివరికి నిజ నిజాలు తెలుసుకొని ముక్కు మీద వేలు వేసుకున్నారు.. ఇంతకీ రవిబాబు ఏమన్నారు? వివరాలు చూద్దాం.. రవిబాబు తండ్రి చలపతిరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు.. అయితే తండ్రి లాగే విలన్ పాత్రల్లో దూసుకుపోవాలని అనుకున్నారట.. ఎందుకంటే రవిబాబు కటౌట్ పూర్తిగా విలన్ లాగే ఉంటుంది.. కానీ రవి బాబుకు నటనకంటే డైరెక్షన్ మీద ఎక్కువ ఇష్టం కాబట్టి కొన్నాళ్లపాటు ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత ‘అల్లరి’ సినిమా ద్వారా డైరెక్టర్ గా మారాడు.. (Jr.NTR)
Also Read: Aishwarya Rajesh: ఇద్దరితో బెడ్ షేర్ చేసుకున్నా.. కోరిక తీర్చుకొని వదిలేశారు..?
ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా పెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లరి నరేష్ కు మొదటి సినిమా కావడంతో ఆయన ఇంటి పేరు కూడా అల్లరి నరేష్ గా మారింది.. ఇక ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు డైరెక్షన్ చేసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారారు. అలాంటి రవిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హైట్ గురించి ప్రస్తావించారు.. నేను ఆరడుగులు ఉంటాను అతను నా భుజం వరకు ఉంటాడు, అతనితో నేను నటించను ఎక్కువ డబ్బు ఇస్తేనే నటిస్తానని చెప్పాను.. దీంతో వాళ్లు నన్ను బ్రతిమిలాడి ఆయనతో నటించేలా చేశారు..

ఇక ఈ మాటలకు పక్కన సింహాద్రి చిత్రంలోని నాజర్, ఎన్టీఆర్, రవిబాబు కలిసి నటించిన సీన్లను జోడించడంతో ఈయన జూనియర్ ఎన్టీఆర్ నే అన్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా రవిబాబుపై విరుచుకుపడుతున్నారు.. నువ్వెంత నీ బ్రతుకెంత, మా ఎన్టీఆర్ ని అంటావా అంటూ కామెంట్లు పెట్టారు.. కొంతమంది అభిమానులు నిజంగానే ఎన్టీఆర్ ను అన్నారా లేదా వేరే హీరోను అన్నారా అని పూర్తిగా ఆరా తీయగా రవిబాబు అన్నది ఎన్టీఆర్ ను కాదట నటుడు ఆశుతోష్ రాణాని అన్నానని క్లారిటీ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రవిబాబును చాలామంది తిట్టిపోస్తున్నారు. చివరికి అన్నది ఎన్టీఆర్ ను కాదని తెలిసి ముక్కు మీద వేలు వేసుకున్నారు.(Jr.NTR)