Daaku Maharaj: డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా స్టార్ హీరో.?
Daaku Maharaj: బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న డాకూ మహారాజ్ మూవీ జనవరి 12న విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇక బాలకృష్ణ ప్రతి ఏడాది సంక్రాంతికి వస్తూ భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే అలాంటి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ఇప్పటివరకు చూడని వర్షన్ లో చూస్తారు అంటూ ఈ సినిమా నిర్మాత నాగ వంశీ ఓ ప్రెస్ మీట్ లో బయట పెట్టారు.
Star hero as guest for Daaku Maharaj pre-release event
అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మంగళగిరి లేదా విజయవాడలో చేయాలని మూవీ మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక పెద్ద హీరోని సర్ప్రైస్ గెస్ట్ ని తీసుకురావాలని చూస్తున్నారట చిత్ర నిర్మాతలు.ఇక సర్ ప్రైజ్ గెస్ట్ అంటే అందరూ చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబునాయుడు కావచ్చు అనుకుంటారు.కానీ మీరు ఊహించుకుంటున్నట్లు ఎవరు కాదు.(Daaku Maharaj)
Also Read: Ram Charan: పుష్ప-2 పై మాట్లాడిన రామ్ చరణ్..బన్నీని అవమానించి..?
అవును మీరు వినేది నిజమే.టాలీవుడ్ సినీ వర్గంలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ ని అతిథిగా తీసుకురావాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఈ సినిమా నిర్మాతలు అయినటువంటి త్రివిక్రమ్,నాగ వంశీలతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో మంచి బాండింగ్ ఉంది.ఇక ఈ అనుబంధం కారణంగానే నాగ వంశీ జూనియర్ ఎన్టీఆర్ ని డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలని కోరారట.
దానికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.. కానీ ఇది అంతా ఫేక్ ప్రచారమని తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటివరకు ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది.. బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిస్తే పోస్ట్ పెట్టిన ఎన్టీఆర్ కి కనీసం రిప్లై ఇవ్వలేదు. నందమూరి తారక రత్న చనిపోతే అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ తో మాట్లాడలేదు బాలకృష్ణ. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి ఎన్టీఆర్ ని పిలవలేదు అలాంటిది తన సినిమా కోసం ఎన్టీఆర్ ని గెస్ట్ గా రావడానికి ఒప్పుకుంటారా అంటూ ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు .(Daaku Maharaj)