Tandel Movie: తండేల్ సినిమాపై స్టార్ హీరో కుట్రలు..?
Tandel movie: ప్రస్తుతం ఫిబ్రవరి మొత్తం తండేల్ హవా నడుస్తుంది అని బాక్సాఫీస్ వద్ద తండేల్ రాజులమ్మ జాతరే అని ఎంతోమంది ఈ సినిమాకి సంబంధించి రివ్యూ ఇస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా ముందు విశ్వక్సేన్ లైలా, అజిత్ విడాముయర్చి ఈ రెండు సినిమాలు కూడా వేస్టే అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తండేల్ సినిమాపై తాజాగా ఓ హీరో కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది .
Star hero conspiracies on Tandel movie
అయితే అసలు విషయం ఏమిటంటే.. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న ఆదివారం రోజు జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ వస్తారని ప్రచారం జరిగింది.కానీ చివర్లో అల్లు అర్జున్ రావడం లేదని చెప్పారు. అయితే అల్లు అర్జున్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడానికి కారణం అల్లు అర్జున్ కి తండేల్ మూవీ నచ్చలేదని,సినిమా చూసి నచ్చకపోవడం వల్లే ఈ సినిమా బాలేదని అందుకే ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రావడానికి అల్లు అర్జున్ ఒప్పుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. (Tandel movie)
Also Read: Naga Chaitanya: ఆ పాట వల్ల నా భార్య ఫీల్ అయ్యింది..తండేల్ ఈవెంట్ లో నాగ చైతన్య!!
తాను ఏదైనా సినిమా ఈవెంట్ కి వెళ్తే కచ్చితంగా సినిమా హిట్ కావాలి.కానీ ఈ సినిమా అస్సలు బాలేదు. ఈ సినిమా ఈవెంట్ కి వెళ్తే నా పరువు పోతుంది అని అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు అంటూ ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.కానీ ఇండస్ట్రీలో ఉండే ఓ హీరో అభిమానులు పనిగట్టుకుని మరీ ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు.
తండేల్ సినిమా అల్లు అర్జున్ కి నచ్చకపోవడం వల్లే ఈవెంట్ కి రాలేదు అని ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారం ఆ స్టార్ హీరో అభిమానులే కావాలని సినిమాపై కుట్రలు చేస్తున్నారు. కానీ సినిమా బాగుంటే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని నాగచైతన్య అభిమానులు సోషల్ మీడియాలో కౌంటరస్ ఇస్తున్నారు.(Tandel movie)