Allu Arjun: అల్లు అర్జున్ ఏడుపు చూసి నవ్వుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..?
Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ ఒకరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి వచ్చాక గొడవ అంత సర్దుమనిగింది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ కి సంబంధించి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో అప్పుడే అసలైన ఆట మొదలైంది.ప్రెస్ మీట్ పెట్టడంతోనే అల్లు అర్జున్ ఇబ్బందుల్లో పడిపోయారు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే అసలు ఈ గొడవ ఇంతవరకు వచ్చేదే కాదు.
Star hero fans are laughing at Allu Arjun crying
అక్కడితో ఎండ్ అయ్యేది.కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నాకు చెప్పలేదు సమాచారం ఇవ్వలేదు నాకు ఆమె చనిపోయిన విషయం తెలియదు అంటూ అబద్ధాలు మాట్లాడంతో మండిపడిన పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేసి మేము ముందుగానే అల్లు అర్జున్ కి సమాచారం ఇచ్చాము. కానీ ఆయన సినిమా చూశాకే వెళ్తాం అంటూ చెప్పడంతో మేము సైలెంట్ అయిపోయాం అంటూ క్లారిటీ ఇచ్చారు. (Allu Arjun)
Also Read: Pushpa-2: పుష్ప-2 లో చూపించినట్టే సీఎం మార్పు.. రేవంత్ రెడ్డి కుర్చీ కింద బాంబ్.?
దీంతో అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలు అని,ఒక మహిళ ప్రాణం పోయిందని చెప్పినా కూడా సినిమానే ముఖ్యమని సినిమా చూశాక వెళ్తామని చెప్పినట్టు అందరూ భావించారు. దీంతో అల్లు అర్జున్ పెద్ద ఇరకాటంలో పడిపోయారు. మళ్ళీ అల్లు అర్జున్ ని చికడిపల్లి పోలీసులు స్టేషన్ కి పిలిచి విచారణ చేశారు.ఇలా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఏడుపు చూసి చాలామంది పవన్ కళ్యాణ్ అభిమనులు నవ్వుకుంటున్నారట.
ఎందుకంటే మెగా అల్లు ఫ్యామిలి మధ్య గత కొద్దిరోజులుగా కోల్డ్ వార్ జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా వైసిపి పార్టీకి ఆయన సపోర్ట్ చేయడంతో ఈ గొడవ మరింత ఎక్కువైంది. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు వర్సెస్ అల్లుఅర్జున్ అభిమానులు అనేలా మారిపోయింది. ఇక పుష్పటు విడుదల సమయంలో కూడా అల్లు అర్జున్ సినిమని ఫ్లాప్ చేస్తాం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యక్షంగానే పోస్టులు పెట్టారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతుంటే పవన్ అభిమానులు తెగ నవ్వుకుంటున్నట్టు తెలుస్తోంది.(Allu Arjun)