Tamannaah: భర్తతో ఎఫైర్ పెట్టుకుందని తమన్నా ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన హీరో భార్య.?
Tamannaah: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగింది అంటే తప్పనిసరిగా వారి మధ్య ఏదో జరుగుతుందని భావిస్తూ ఉంటారు.. కొంతమంది వ్యక్తులు ఏకంగా వారి మధ్య లవ్ ఉంది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు క్రియేట్ చేస్తారు. అయితే పెళ్లి కానీ హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటివి రాస్తే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు కానీ, పెళ్లయిన వారిపై కూడా ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే వారి సంసార జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..

Star Hero wife warning to Tamannaah
ఆ విధంగానే ఆ పెళ్లయిన హీరోను తమన్నా లవ్ చేసిందని పెళ్లి కూడా చేసుకోబోతుందని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.. ఈ విషయం హీరో భార్యకు తెలిసి ఆమె తమన్నాకు వార్నింగ్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది.. ఆ వివరాలు చూద్దాం.. తమన్నా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దగ్గరికి వస్తోంది. ఇప్పటికీ ఈమె ఏ మాత్రం తరగని అందంతో సినిమాల్లో దూసుకుపోతూనే ఉంది. (Tamannaah)
తన తోటి హీరోయిన్లు అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఈమె మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు.. అయితే తమన్నా హీరో కార్తీతో లవ్ లో పడిందని ఆయననే పెళ్లి చేసుకోవాలని భావించిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఆవారా, ఊపిరి, సిరుతై అనే చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఈ సినిమాల్లో చేసే సమయంలో ఇద్దరు మధ్య లవ్ పుట్టిందని కార్తీ తన భార్యకు విడాకులు కూడా ఇచ్చి తమన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు వచ్చాయి..

అయితే ఈ విషయం కాస్త కార్తి భార్యకు తెలియడంతో తమన్నాకు షూటింగ్ సెట్ కు వచ్చి మరీ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటినుంచి అమ్మాయిలను ముట్టుకోకుండా నువ్వు షూటింగ్ లో పాల్గొనాలని కార్తీకి వార్నింగ్ ఇచ్చిందట. దీంతో కార్తీ ఆమెను కొన్నాళ్లపాటు భార్యను షూటింగ్స్ స్పాట్ లోకి తీసుకెళ్లి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం అయ్యేలా చూపించారట.. అవన్నీ చూసి అర్థం చేసుకున్న ఈమె షూటింగ్ సెట్లో ఇవన్నీ కామనని తెలుసుకొని అప్పటినుంచి కార్తిని అనుమానించడం మానేసిందని కార్తీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.(Tamannaah)