Sunil: సునీల్ కి అవమానం.. చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.?
Sunil: కమెడియన్ గా.. విలన్ గా.. హీరోగా.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్ సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగాడు. అలా చివరికి ఈయన ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న వంటి సినిమాలతో హీరోగా మారిపోయారు.
Star heroine insult Sunil
అయితే అలాంటి సునీల్ ని ఓ స్టార్ హీరోయిన్ చెంప పగలగొట్టి అవమానించిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు సునీల్ చెంప పగలగొట్టింది అనేది ఇప్పుడు చూద్దాం. కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ కామెడీ ఫేస్ లా ఉండడంతో సినిమాల్లో ఆయన కామెడీ బాగా పండింది. దాంతో ఈయనకు వరుస సినిమాల్లో కమెడీయన్ అనగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత హీరో అవకాశాలు కూడా వచ్చాయి.(Sunil)
Also Read: Revanth Reddy: నాగార్జున, బన్నీ పై రేవంత్ రెడ్డి పగ పెంచుకోవడానికి కారణం అదేనా.?
అలా కామెడీ హీరోగా కూడా సునీల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇక కలర్ ఫోటో సినిమా ద్వారా విలన్ గా మారిన సునీల్ పాన్ ఇండియా విలన్ గా కూడా మారిపోయారు స్టార్ హీరోలైన అల్లు అర్జున్,రజినీకాంత్ సినిమాలలో విలన్ పాత్రలో అదరగొట్టేశారు.అయితే అలాంటి సునీల్ సినిమా షూటింగ్ జరిగే సమయంలో చాలా ఫన్నీగా ఉంటారట.ఆయన సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో చాలా సరదాగా మాట్లాడుతూ వారిపై ఫన్నీ ఫన్నీ సెటైర్లు వేస్తూ ఉంటారట.
అలా ఓసారి త్రిష హీరోయిన్ గా చేసిన ఓ సినిమాలోకూడా సునీల్ నటించారు. ఆ టైంలో త్రిషపై సునీల్ సరదాగా ఫన్నీ సెటైర్ వేశారట.కానీ అప్పటికే కోపంలో ఉన్న త్రిష అందరి ముందే సునీల్ చెంప పగలగొట్టిందట. దానికి కాస్త అవమానంగా ఫీల్ అయిన సునీల్ నెక్స్ట్ డే షూటింగ్ కి కూడా రాలేదట.ఆ తర్వాత చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సునీల్ మళ్ళీ సినిమా షూటింగ్ లో యథావిధిగా పాల్గొన్నారు. కానీ త్రిష చేసిన అవమానం ఇప్పటికి కూడా సునీల్ మర్చిపోలేదని తెలుస్తోంది.(Sunil)