Tamannaah: తమన్నాని ఆంటీ అని అవమానించిన స్టార్ హీరోయిన్..?

Tamannaah: ఏంటి పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తమన్నా ని ఆంటీ అని అవమానించిందా.. ఇంతకీ తమన్నాని ఆంటీ అని పిలిచి అవమానించిన ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది నటీమణులు పెళ్లయి పిల్లలు ఉన్నా సరే ఆంటీ అని పిలిపించుకోవడానికి అస్సలు ఒప్పుకోరు.వారిని ఆంటీ అని పిలిస్తే వారి ఈగో హర్ట్ అవుతుంది.అయితే ఆంటీ అనే విషయంపై మన సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రాజుకున్న సంగతి మనకు తెలిసిందే.

Star heroine who insulted Tamannaah as aunty

Star heroine who insulted Tamannaah as aunty

ఎందుకంటే యాంకర్ నటి అయినటువంటి అనసూయని చాలామంది సోషల్ మీడియా జనాలు ఆంటీ అని పిలుస్తుంటారు. కానీ ఆంటీ అని పిలవడం అనసూయ కి అస్సలు నచ్చదు.ఈ విషయంలో పెద్ద వివాదం తలెత్తిన సంగతి మనకు తెలిసిందే.యాంకర్ అనసూయ విషయం పక్కన పెడితే.. తమన్నాని ఓ యంగ్ హీరోయిన్ ఆంటీ అని పిలవడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.మరి ఇంతకీ తమన్నాని ఆంటీ అని పిలిచిన హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని..(Tamannaah)

Also Read: Mahesh Babu: మహేష్ ఒప్పుకొని ఉంటే నాగచైతన్య సమంత పెళ్లి చేసుకునే వారు కాదా.?

పాల మీగడలాంటి తెలుపుతో మెరిసిపోయే తమన్నా ని అసలు ఆంటీ అని ఆ హీరోయిన్ ఎందుకు పిలిచింది అని ఈమె మాటలు విన్న చాలా మంది షాక్ అవుతున్నారు. అయితే రవీనా టాండన్ కూతురు తమన్నా ని ఆంటీ అని పిలిస్తే తమన్నా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా పర్వాలేదు నువ్వు ఆంటీ అని పిలిస్తే నేను ఏమనుకోను అలానే పిలువు అని మాట్లాడడం తమన్న అభిమానులకు షాకింగ్ గా అనిపించింది. అయితే తమన్నా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి తాజాగా రవీనా టాండన్ కూతురు రాషా తడానీ నటించిన తొలి మూవీ ఆజాద్ చూడడానికి థియేటర్ కి వెళ్ళింది.

Star heroine who insulted Tamannaah as aunty

అయితే సినిమా చూసి వస్తున్న సమయంలో రవీనా టాండన్ కూతురు తమన్నా ని ఆంటీ అని పిలిచి వీడియో నెట్టీంట చక్కర్లు కొడుతుంది.అయితే తమన్నాని ఆంటీ అని పిలిచినప్పటికీ ఆమె ఏమాత్రం ఫీల్ అవ్వకుండా పర్వాలేదు అని మాట్లాడడం అందరికీ షాకింగ్ గా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పెళ్లి కాకముందే తమన్నా ఆంటీ అయిపోయిందా అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)

https://twitter.com/PanIndiaReview/status/1881711286440128759

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *