Ram Charan: రామ్ చరణ్ కోసం కొట్టుకుంటున్న స్టార్ హీరోయిన్లు..?

Ram Charan: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు అంటారు. ముఖ్యంగా తన సొంత అక్క చెల్లెళ్లపై కూడా ఆడవాళ్లు అసూయ పెంచుకుంటారు. ఇంట్లో సొంత అక్క చెల్లెళ్ళు మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి. డ్రెస్సుల విషయంలో, డబ్బుల విషయంలో అందచందాల విషయంలో, అలాగే అద్దం ముందు మేకప్ చేసుకునే సమయంలో చాలా టైమ్స్ లో అక్క చెల్లెల మధ్య గొడవలు ముదురుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని ఈ అక్కాచెల్లెల మధ్య కూడా తీవ్రమైన గొడవ వచ్చిందట..
Star heroines fighting for Ram Charan
అక్క చెల్లిని పిలిచి ఆఫర్ ఇప్పిస్తే ఇప్పుడు చెల్లి స్టార్ హీరోయిన్ గా మారి అక్క స్థానానికి ఎసరు పెట్టే పరిస్థితి ఏర్పడిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ అక్క చెల్లెలు ఎవరయ్యా అంటే రష్మిక మందాన, శ్రీలీల.వీరు ఇద్దరు కన్నడ బ్యూటీసే.. రష్మిక కాస్త ముందుగా వచ్చి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక లేటుగా వచ్చినటువంటి శ్రీ లీల ప్రస్తుతం స్టార్ గా కొనసాగుతోంది.. ప్రస్తుతం శ్రీలీలాకు రష్మికకు ఒక గ్లోబల్ హీరోతో నటించే అవకాశం వచ్చిందట. (Ram Charan)
Also Read: Shalini Pandey: షాలినికి అవమానం.. బట్టలు విప్పాక సడన్ గా డైరెక్టర్ డోర్ తీసి.?
అయితే ఈ సినిమా కోసం ఇద్దరూ బాగా కొట్లాడుకుంటున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ సుకుమార్ తో చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందానా అని భావించాడు. కానీ తరచు ఆమెనే హీరోయిన్ గా తీసుకోవడం వల్ల బాగుండదని సుకుమార్ కాస్త వెనక్కి ఆలోచించినట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో శ్రీలీలాను హీరోయిన్ గా తీసుకుందామని అనుకున్నారట..దీంతో రష్మిక ప్లేస్ ను శ్రీలీలా కొట్టేసే అవకాశం కనిపిస్తోంది.

అయితే శ్రీలీలా ను సుకుమార్ కు పరిచయం చేసింది కూడా రష్మిక మందానే. పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో శ్రీ లీలాను తీసుకోండని ప్రపోజ్ చేసిందట. అలా సుకుమార్ కు శ్రీ లీలా కు పరిచయమైపోయింది.. ఈ విధంగా అక్క పరిచయం చేసిన చెల్లి ప్రస్తుతం తన స్థానానికి ఎసరు పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు. మరి ఇందులో రామ్ చరణ్ తో నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారు అనేది ముందు ముందు తెలుస్తుంది..(Ram Charan)