Sudeep: ఆ హీరోయిన్ మోజులో పడి భార్యకు అన్యాయం చేసిన సుదీప్.?
Sudeep: నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత సినిమా ఇండస్ట్రీ వారికి ఎక్కువగా సూట్ అవుతుంది. ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లు ఇతర నటీనటుల మధ్య ఎఫైర్ వార్తలు అనేకం వస్తూ ఉంటాయి. ఈ వార్తల్లో ఎక్కువగా ఫేక్ వార్తలు మరి కొన్ని నిజాలు ఉంటాయి.. ఎక్కువగా ఫేక్ వార్తలు రావడం వల్ల ఒక్కోసారి నిజం చెప్పినా కానీ నెటిజన్స్ నమ్మలేని పరిస్థితులు ప్రస్తుత కాలంలో ఏర్పడ్డాయి..

Sudeep who fell in love with that heroine
అలా హీరో హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు వరసగా చేస్తే వారి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈ వార్తల వల్ల కొంతమంది పెళ్లయిన హీరో హీరోయిన్ల సంసారాలు కూలిపోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.. అలాంటి పరిస్థితి ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు ఎదురైంది.. ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి స్టార్ హీరో అయ్యారు..(Sudeep)
Also Read: Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కి తెలుగు లో ఆఫర్.. మాస్ హీరో సరసన!!
అయితే ఈయన షూటింగ్ స్కిల్స్ నేర్చుకునే సమయంలోనే ప్రియా అనే అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి కాకముందు ప్రియా అనేక ఉద్యోగాలు చేసింది.. ఎప్పుడైతే ప్రియాని పెళ్లి చేసుకున్నారో కిచ్చా సుదీప్ స్టార్ హీరో అయ్యారు. దీంతో ఆమెను అన్ని జాబ్స్ మాన్పించి ఇంట్లోనే ఉంచారు.ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది..

అలా సంసారం హ్యాపీగా సాగుతున్న తరుణంలో కిచ్చా సుదీప్ పై వచ్చినటువంటి ఈ వార్త వీరి సంసార జీవితంలో చిచ్చు పెట్టింది. అయితే సుదీప్ నిత్యామీనన్ తో లవ్ లో ఉన్నారని, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఆయన ప్రియాకు విడాకులు కూడా ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా కూడా కోడై కూసింది.. ఇక దీనిపై స్పందించినటువంటి కిచ్చా సుదీప్ మా మధ్య అలాంటిదేమీ లేదని, అవన్నీ ఫేక్ వార్తలని కొట్టి పారేశారు. నేను విడాకులు కూడా తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు..(Sudeep)