Sudheer Babu: బ్యాడ్మింటన్ నుండి వెండితెర వరకు..సుధీర్ బాబు సినీ ప్రయాణం!!
Sudheer Babu: దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు, తమ తండ్రుల స్టార్‌డమ్‌ను ఉపయోగించకుండా స్వతంత్రంగా నటుడిగా తనదైన గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తి. 2010లో “ఏ మాయ చేసావే” (Ae Maya Chesave) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్, ఆ తరువాత “శివ మనసులో శృతి” (Shiva Manasulo Shruti) చిత్రంలో హీరోగా నటించారు.
Sudheer Babu Badminton player achievements
సుధీర్ బాబు, ప్రియదర్శిని ఘట్టమనేని భర్తగా, ఇద్దరు కుమారుల తండ్రి. సినీ పరిశ్రమలో తనదైన శైలి, నటనతో “మోసగాళ్లకు మోసగాడు” (Mosagallu), “నన్ను దోచుకుందవటే” (Nannu Dochukunduvate) వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించారు. అతను సోషల్ మీడియా లో కూడా యాక్టివ్‌గా ఉంటాడు.
సుధీర్ బాబు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా ప్రసిద్ధి పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడన్న విషయం తెలిసిందే. అలాగే, పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand)తో కలిసి డబుల్స్‌లో ఆడాడు. ఈ ఫోటో రన్నరప్ మెడల్ సాధించినప్పుడు తీసుకున్నది. ప్రస్తుతం, సుధీర్ బాబు తనయుడు మానస్ త్వరలో సినిమాల్లోకి ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం, సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.